- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: ఏపీ బీఆర్ఎస్‌లోకి భారీగా చేరికలు.. కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్న ప్రజలు
దిశ, ఏపీ బ్యూరో: పేద బడుగు వర్గాలకు భారత రాష్ట్ర సమితిలో సముచిత స్థానం కల్పిస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లోని బీఆర్ఎస్ఏపీ క్యాంపు కార్యాలయంలో పలువురు నేతలు పార్టీలో చేరారు. కాపు సంక్షేమ యువసేన రాష్ట్ర అధ్యక్షుడు, రాధ రంగా మిత్ర మండలి తిరుపతి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఆర్కాట్ కృష్ణ ప్రసాద్ సహా పలు జిల్లాలకు చెందిన నాయకులకు కండువాతో తోట స్వాగతించారు.
ఈ సందర్భంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ టీడీపీ, వైసీపీ పాలనలో సామాన్యులు బతకలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నట్లు పేర్కొన్నారు. విపరీతంగా పెరిగిన నిత్యావరసర ధరలు, కరెంట్ చార్జీలతో పేద, మధ్య తరగతి కుటుంబాలు కుదేలైపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు . రాష్ట్రంలో బీఆర్ఎస్ప్రత్యామ్నాయంగా ఎదిగినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు బీఆర్ఎస్అధినేత కేసీఆర్నాయకత్వాన్ని కోరుకుంటున్నట్లు స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేయాలని పార్టీలో చేరిన వారికి తోట సూచించారు.