- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దుర్గమ్మ సేవలో ఏపీ బీజేపీ చీఫ్ Daggubati Purandeswari
X
దిశ, డైనమిక్ బ్యూరో : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి దర్శించుకున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా గురువారం బాధ్యతలు చేపట్టిన పురంధేశ్వరి శుక్రవారం ఉదయం భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇతర బీజేపీ నాయకులతో కలిసి అమ్మవారిని దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేయగా అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించారు. దుర్గమ్మను దర్శించుకున్న దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దగ్గుబాటి పురంధేశ్వరి దంపతులకు ఆలయ వేద పండితులు వేదాశీర్వచనం చేసి అమ్మవారి శేషవస్త్రం అందజేశారు. ఆ తర్వాత అమ్మవారి ప్రసాదాన్ని ఆలయ అధికారులు, పండితులు అందజేశారు.
Advertisement
Next Story