- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
AP: ప్రతిపక్షానికి అంతుచిక్కని బాబు ఎత్తుగడ.. బీజేపీలోకి టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన పార్టీలు అన్ని ఇప్పటికే ఎన్నికల రణరంగంలోకి దిగాయి. బీ ఫాంల పంపిణీ ప్రక్రియ కూడా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత అంతుచిక్కని ఎత్తుగడలతో రాజకీయాలను ఒంటిచేత్తో శాసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తులకు చెక్ పెట్టేందుకు బాబు అవావహును బుజ్జగిస్తున్నారు. మరికొన్ని చోట్ల వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నారు. అయితే, అనపర్తి టికెట్ టీడీపీలో కొరకరాని కొయ్యగా తయారైంది. వివాదం ఎంతకీ సద్దుమణగకపోవడంతో అనపర్తి అసెంబ్లీ సీటుపై టీడీపీ చీఫ్ చంద్రబాబు నేతలతో సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు.
నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో చంద్రబాబు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. జెండా ఏదైనా కూటమి అజెండా గెలవాలని నల్లమిల్లికి చంద్రబాబు దిశానిర్దేశం చేసినట్లుగా తెలుస్తోంది. ఎవరూ ఊహించిన విధంగా అనపర్తి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవాలని నల్లమిల్లికి చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ హైకమాండ్ కూడా సరైన అభ్యర్థులు లేకపోవడంతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి పసుపు జెండా వదిలేసి కాషాయ పార్టీలో చేరాలని ఆదేశించినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే నల్లమిల్లి బీజేపీలో చేరితే అనపర్తి నుంచి టికెట్ ఖరారు కానుంది. ఈ విషయంపై నేడో, రేపో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.