- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేటితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. నిరాశలో టీడీపీ సభ్యులు
దిశ డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటితో ముగియనున్నాయి. ఇక ఈ రోజు కొనసాగుతున్న సమావేశాల్లో మళ్ళీ నిన్నటి సీన్ రిపీట్ అయ్యింది. టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. వివరాల్లోకి వెళ్తే.. నాలుగో రోజు ప్రారంబైన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అలానే మద్యపాన నిషేధం గురించి చరచ్చించాల్సిందిగా కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే డా. డోలా బాల వీరాంజనేయ స్వామి అలానే ఇతర టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు.
నేడు రాష్ట్రంలో యువత నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇక రాష్ట్రం మధ్యపానంలో మునిగితేలుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్ట్ లో పేర్కొన్నారు. కానీ నేటీకి అది అమలు జరగలేడు అని టీడీపీ సభ్యలు నినదించారు. ఈ రోజుతో అసెంబ్లీ సమావేశాలు ముగిసిపోతున్నాయని.. కనీసం ఈ ఒక్క వాయిదా తీర్మానంపై చర్చించేందుకు అనుమతించాలని టీడీపీ సభ్యులు కోరారు.
అయితే టీడీపీ సభ్యుల వ్యాఖ్యలపై స్పీకర్ స్పందించలేదు. ప్రజాపక్షాన ప్రజల సమస్యలపై చర్చించాలని కోరుతున్న స్పీకర్ స్పందించని నేపథ్యంలో ఆగ్రహానికి లోనైన టీడీపీ సభ్యులు ప్రభుత్వ తీరుపై నినాదాలు చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే మద్యపానాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పిన వైసీపీ మహిళలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. సమావేశాలు ఆఖరి రోజుకు చేరుకున్న ప్రభుత్వం మాత్రం ప్రజల సమస్యలపై చర్చించటానికి ఆసక్తి చూపడంలేదని.. ప్రజా పాలనా అంటే ఇదేనా అని ప్రశ్నించారు.
నిన్న జరిగిన సమావేశంలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇతర టీడీపీ సభ్యులు సాగునీటి ప్రాజెక్టులు, వ్యాసాయ ధరల పెరుగుదల పై చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా తీర్మాన్ని స్పీకర్ తిరస్కరించారు. ప్రజాసంక్షేమం కోసం, ప్రజల సమస్యలపై చర్చించాలని కోరిన టీడీపీ సభ్యులకు నిరాశే మిగిలింది.