AP Assembly: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ అయ్యన్న కీలక ఆదేశాలు

by Shiva |
AP Assembly: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. స్పీకర్ అయ్యన్న కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ (Andhra PradesH) బడ్జెట్ సమావేశాలు (Budget Sessions) ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. ముందుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nazir) ప్రసంగంతో సభ మొదలు ప్రారంభం కానుంది. అయితే, బడ్జెట్ సమావేశాలు నేటితో ప్రారంభమై 20 రోజుల పాటు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ (Assembly) ఆవరణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకుండా పోలీసు ఉన్నతాధికారులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ (Prakasam Barrage) నుంచి అసెంబ్లీ (Assembly)కి వెళ్లే మార్గాల్లో పోలీసులను మోహరించారు. ఈ క్రమంలోనే స్పీకర్ అయ్యన్న పాత్రుడు (Speaker Ayyannapatrudu) కీలక ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీ ఆవరణలో మంత్రులు, ఎమ్మెల్యేల వ్యక్తిగత సహాయకులకు ఎంట్రీ లేదని అన్నారు. ఎవరైనా సీఎం (CM) లేదా మంత్రుల (Ministers)ను కలిసే వారు నేరుగా సీఎంవో (CMO)కే వెళ్లాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇవాళ ప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగానికి హాజరుకావాలని వైసీపీ నిర్ణయించింది.

కాగా, బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఇవాళ ఉదయం 9. 45 గంటలకు అసెంబ్లీకి చేరుకోనున్నారు. గవర్నర్‌కు అబ్దుల్ నజీర్‌ (Governor Abdul Nazir) కు గార్డ్ ఆఫ్ ఆనర్ తరువాత సీఎంతో పాటు ఆయనకు అసెంబ్లీ వద్ద మండలి చైర్మన్, స్పీకర్, సీఎస్, సెక్రటరీ జనరల్ స్వాగతం పలకనున్నారు. అనంతరం అసెంబ్లీలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అనంతరం సభ మంగళవారం నాటికి వాయిదా పడనుంది. అనంతరం బీఏసీ (BAC) సమావేశమై అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి, ఇతర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

Next Story

Most Viewed