జనసేన నుంచి నగరి MLAగా పోటీ చేస్తున్న అనుష్క.. టెన్షన్‌లో రోజా!

by Jakkula Samataha |   ( Updated:2024-03-22 04:30:37.0  )
జనసేన నుంచి నగరి MLAగా పోటీ చేస్తున్న అనుష్క.. టెన్షన్‌లో రోజా!
X

దిశ, సినిమా : ఏపీలో రోజు రోజుకు రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో, రాజకీయ నాయకులు తమదైన శైలిలో ప్రచారం చేస్తూ, ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇక చాలా కాలం నుంచి సినీ నటులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.

అయితే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతోంది. ఎవరూ ఊహించని విధంగా ఏపీ రాజకీయాల్లోకి ఓ బ్యూటీ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు వార్త వైరల్ అవుతోంది. తన నటనతో మంచి పేరు సంపాదించుకున్న ముద్దుగుమ్మ అనుష్క శెట్టి. ఈ అమ్మడు చాలా రోజుల నుంచి టాలీవుడ్‌కు దూరంగా ఉంటుంది. ఈ మధ్యనే మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి సినిమాతో తన అభిమానులను పలకరించింది.

అయితే ఈ బ్యూటీ సినిమాలకు గుడ్ బై చెప్పి, పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నదంట. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం జనసేన నుంచి నగరి ఎమ్మెల్యేగా అనుష్క పోటీ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రోజాకు పోటీగా అనుష్క రంగంలోకి దిగనున్నదంట. దీంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. అనుష్క ఏంటీ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇవ్వడం ఏంటీ? అని అయోమయంలో పడిపోయారు. పవర్ స్టార్‌కు సపోర్టుగా ఉండాలనుకొని స్వీటీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తోంది. దీంతో జనసేన తరఫు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో అనుష్కకు పలువురు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా, ఈ వార్తను అనుష్క అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని పేర్కొంటున్నారు. ఇక ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story