- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అంగళ్లు కేసులో టీడీపీ శ్రేణులకు ఊరట.. 11 మందికి ముందస్తు బెయిల్
X
దిశ, వెబ్‌డెస్క్: అంగళ్లు కేసులో టీడీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. చంద్రబాబును ఏ-1గా చేర్చగా.. అనేకమంది పార్టీ నేతలు, కార్యకర్తలపై కేసులు నమోదయ్యాయి. కొంతమంది రిమాండ్ ఖైదీగా కొద్దిరోజుల పాటు జైల్లో ఉండి ఆ తర్వాత బెయిల్‌పై బయటకొచ్చారు. మరికొంతమందికి కోర్టుల్లో ముందస్తు బెయిల్ మంజూరవుతున్నాయి. తాజాగా ఈ కేసులో మరికొంతమంది టీడీపీ శ్రేణులకు ఊరట లభించింది.
ఈ కేసులో గురువారం 11 మందికి ముందస్తు బెయిల్ మంజూరైంది. మదనపల్లె రెండో అదనపు జిల్లా జడ్జి కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. దీంతో టీడీపీ శ్రేణులకు ఊరట కలిగినట్లైంది. కాగా ఇప్పటికే అంగళ్లు కేసులో చంద్రబాబుకు హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. రూ.లక్ష పూచీకత్తులో రెండు షూరిటీలతో ఇటీవల ముందస్తు బెయిల్ ఇచ్చింది.
Advertisement
Next Story