- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: చంద్రబాబు సర్కార్ మరో సంచలన నిర్ణయం
దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు పాలనలో తనదైన శైలీలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే గత వైసీపీ ప్రభుత్వంతో అంటకాగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై యాక్షన్ తీసుకుంటున్నారు. తాజాగా గత వైసీపీ సర్కార్ హయంలో కీలకంగా పనిచేసిన ఇద్దరు అధికారులపై విజిలెన్స్ విచారణకు ఆదేశించారు. ప్రముఖ తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) మాజీ అదనపు ఈఓ ధర్మారెడ్డి, ఐ అండ్ పీఆర్ మాజీ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డిపై ప్రభుత్వం విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఈ ఇద్దరూ పదవుల్లో ఉండగా భారీగా అవినీతికి పాల్పడ్డారని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డితో పాటుగా వీరికి సహకరించిన ఉద్యోగులను సైతం విచారించాలని ప్రభుత్వం ఆదేశించింది. కాగా, ధర్మారెడ్డిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయగా.. విజయ్ కుమార్ రెడ్డిపై జర్నలిస్ట్ సంఘాలు ప్రభుత్వానికి కంప్లైంట్ చేశాయి. వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన ధర్మారెడ్డి, విజయ్ కుమార్ రెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో సచివాలయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.