- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పవన్ గెలుపుపై తల్లి అంజనా దేవి హార్ట్ టచింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిఠాపురం నుండి భారీ మెజార్టీతో విజయం సాధించారు. సమీప వైసీపీ అభ్యర్థి వంగా గీతపై పవన్ కల్యాణ్ 71 వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో రికార్డ్ విజయం అందుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన గాజువాక, భీమిలీ రెండు చోట్ల ఓటమి పాలైన పవన్ కల్యాణ్ విశ్వాసం కోల్పోలేదు. మొక్కవోని ధైర్యంతో అధికార వైసీపీని ఇరుకున పెడుతూ నిరంతరం ప్రజలతో మమేకమవుతూ ఎల్లప్పుడు వారి మధ్యే ఉన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చిన అందరికంటే ముందే పవన్ కల్యాణ్ ఫీల్డ్‌లో జనానికి ధైర్యం చెబుతూ సీఎం జగన్‌పై నిప్పులు చెరిగారు.
ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఈ సారి పిఠాపురం అసెంబ్లీ స్థానం బరిలోకి దిగారు. పవన్ కల్యాణ్‌ను ఓడించిడానికి బలమైన అభ్యర్థిని వంగా గీతను పోటీకి దించిన వైసీపీ.. జనసేనాని ఓటమికి ఎన్ని రకాలుగా ప్రయత్నాలు చేయాలో అన్ని రకాలుగా ట్రై చేసింది. సీఎం జగన్ ఏకంగా పిఠాపురంలో వంగా గీతను గెలిపిస్తే ఆమెకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని బహిరంగంగా బంపర్ ఆఫర్ ఇచ్చారు. జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించిన పవన్ గెలుపును మాత్రం అడ్డుకోలేకోపోయింది. పిఠాపురం నియోజకవర్గ చరిత్రలోనే పవన్ రికార్డ్ మెజార్టీతో విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైన వెనక్కి తగ్గకుండా పోరాడి గెలిచిన పవన్ పోరాట పటిమను ప్రతిఒక్కరూ మెచ్చుకుంటున్నారు. పవన్ గెలుపుపై ఇప్పటికే పలువురు శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే సోదరుడు చిరంజీవి, చంద్రబాబు, ప్రధాని మోడీ, అమిత్ షా వంటి అగ్రనేతలు పవన్‌ను అభినందించారు. తాజాగా పవన్ కల్యాణ్ గెలుపుపై ఆయన తల్లి అంజనా దేవి రియాక్ట్ అయ్యారు. ఎన్నికల్లో మా అబ్బాయి గెలిచినందుకు సంతోషంగా ఉందని జనసేనాని తల్లి ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో మా అబ్బాయి పడిన కష్టాలకు ఆ దేవుడు ఇన్నాళ్లకు మంచి ఫలితాన్ని ఇచ్చాడని కాస్త ఎమోషనల్ అయ్యారు. ఇక, ఇక నుంచి గాజు గ్లాస్‌లో టీ తాగుతానని ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాగా, జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసు అనే విషయం తెలిసిందే.