'అంగన్వాడీలు తమ హక్కుల సాధనకు పోరాడాలి'

by Sumithra |   ( Updated:2022-11-26 15:27:40.0  )
అంగన్వాడీలు తమ హక్కుల సాధనకు పోరాడాలి
X

దిశ, డైనమిక్ బ్యూరో : అంగన్వాడీలు తమ హక్కులకోసం కలిసి కట్టుగా పోరాటం చేయాల్సిన అవసరం ఉందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గపూర్ పిలుపునిచ్చారు. అందరూ కలిసి ఐక్యమత్యంగా..ఒకే మాట ఒకే బాటగా ముందుకు సాగుతూ తమ న్యాయమైన డిమాండ్లను సాధించుకోవాలని సూచించారు. ఏపీ అంగన్‌వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ రాష్ట్ర 10 వ మహాసభలు గుంటూరులో జరుగుతున్నాయి.

ఈ మహాసభలకు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్మిక సంఘాలకు చెందిన సుమారు 500 మంది ప్రతినిధులు హాజరయ్యారు. రెండోరోజు అయిన శనివారం నగరంలో ర్యాలీ నిర్వహించారు. మహాసభలో కనీస వేతనాలు, రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీల అమలు, ఐసీడీఎస్ వ్యవస్థ పరిరక్షణ కోసం ఉద్యమ కార్యాచరణపై చర్చించారు.

READ MORE

అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్‌ బుక్‌ రాజ్యాంగం:YS Jagan Mohan Reddy (వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి)

Advertisement

Next Story

Most Viewed