Big Breaking: భారత ఉపరాష్ట్రపతి తో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భేటీ

by Indraja |
Big Breaking: భారత ఉపరాష్ట్రపతి తో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భేటీ
X

దిశ డైనమిక్ బ్యూరో: భారత నౌకాదళం మిలాన్‌–2024 విన్యాసాలను ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఈ విన్యాసాల్లో భాగంగా ఈ రోజూ ఆర్కే బీచ్‌లో సిటీ పరేడ్‌ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ముఖ్య అతిథులుగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కాగా ఇప్పటికే విశాఖ చేరుకున్న భారత ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌కడ్, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఒకరినొకరు కలుసుకున్నారు.

ఇద్దరు లేజడరీ నాయకులు కలుసుకున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా లో హల్చల్ చేస్తున్నాయి. ఇక భారత నౌకాదళం తయారు చేసిన తొలి విమాన వాహక యుద్ధ నౌక ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌ ఈ విన్యాసాల్లో పాల్గొనేందుకు తొలిసారిగా విశాఖ చేరుకుంది. తూర్పు నౌకాదళం కేంద్రంగా విక్రాంత్‌ విధులు నిర్వర్తిస్తుందని గత ఏడాది ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. అప్పటి నుండి వివిధ కార్యకలాపాల్లో విక్రాంత్‌ పాలుపంచుకుంటుంది.

అయితే విక్రాంత్‌ని బెర్తింగ్‌ చేసేందుకు అవసరమైన బెర్త్‌ ఇక్కడ లేకపోవడంతో.. విక్రాంత్‌కు అనుగుణమైన భారీ బెర్త్‌ నిర్మించేందుకు విశాఖపట్నం పోర్టు అథారిటీతో నౌకాదళం ఒప్పందం కుదుర్చుకుంది. ఇక ప్రస్తుతం విశాలో జరుగుతున్న మిలాన్‌–2024 విన్యాసాల్లో పాలుపంచుకునేందుకు విశాఖకు చేరుకున్న విక్రాంత్‌ను విశాఖ కంటైనర్‌ టెర్మినల్‌లో బెర్తింగ్‌ చేశారు.

Advertisement

Next Story

Most Viewed