Breaking: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు

by srinivas |   ( Updated:2024-10-26 12:29:56.0  )
Breaking: తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ కేబినెట్(Telangana Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో పలు అంశాలపై చర్చించారు. అనంతరం పలు నిర్ణయాలకు మంత్రులు ఆమోదం తెలిపారు. ములుగు(Mulugu)లో సమ్మక్క-సారలమ్మ వర్సిటి(Sammakka-Saralamma Varsity)కి తక్కువ ధరకే భూములు కేటాయించాలని నిర్ణయించారు. మద్నూర్ మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేసేందుకు ఆమోదం తెలిపారు. హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిధి పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏటూరు నాగారం రెవెన్యూ డివిజన్ ఏర్పాటును ఆమోదించారు. సన్ని బియ్యానికి రూ.500 బోనస్‌ ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రేరాలో 54 ఉద్యోగాలు భర్తీ చేసేందుకు టీజీపీఎస్సీకి ఆదేశాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణానికి గోషామహల్‌ పోలీస్‌ గ్రౌండ్స్‌ భూమి బదలాయింపునకు కేబినెట్ భేటీలో మంత్రులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed