Kalyanduram: వరస దొంగతనాలతో బెంబేలు

by srinivas |
Kalyanduram: వరస దొంగతనాలతో బెంబేలు
X

దిశ కళ్యాణదుర్గం: కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి, కంబదూరు కళ్యాణదుర్గం మండల ప్రజలను వరస దొంగతలు బెంబేలెత్తిస్తున్నాయి. కళ్యాణదుర్గం పట్టణం బళ్లారి రోడ్డు పక్కనే ఉన్న మనోహర్ ప్లాజా కాంప్లెక్స్‌లో ఒకేరోజు మూడు షాపుల్లో దొంగతనం జరిగింది. రెండు వారాల క్రితం కంబదూరు మండలం ఓబుగానుపల్లిలో ఒకే రోజు 8 ఇళ్లల్లో దొంగలు చొరబడి డబ్బు, నగులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన మరువకముందే అదే మండలం గుద్దేళ్లలో మూడిళ్లను టార్గె్ట్ చేసి దొంగతనం చేశారు. అటు కంబదూరు టౌన్‌లో ఐదు దుకాణాల్లో, ఐదు రోజుల కిందట కుందుర్పి మండలంలో మూడు ఇళ్లలో దొంగతనం జరిగింది. దొంగలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఏరియాలో చోరీలకు పాల్పడుతుండటంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు.

పోలీసులు నిఘా తప్పిందా?

వరుస దొంగతనాలతో కళ్యాణందుర్గం పోలీసుల నిఘా తప్పిందని ప్రజలు విమర్శిస్తున్నారు. కంబదూరు మండలంలో వరుస దొంగతనాలు జరుగుతున్నా ఇంతవరకు ఏ ఒక్కరిని పట్టుకోలేదని విమర్శిస్తున్నారు. కొంతమంది పోలీసులు గస్తీ చేపడుతున్నా దొంగతనాలు జరగడం అంతుపట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దొంగతనాలు వెనుక అంతర్రాష్ట్ర దొంగలు ముఠా స్కెచ్ ఉందా లేదా స్థానిక వ్యక్తులే చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు

Advertisement

Next Story