త్వరలో టీడీపీ ఖాళీ కాబోతోంది.. బుద్ధా వెంకన్నకు కేశినేని స్ట్రాంగ్ కౌంటర్

by srinivas |   ( Updated:2024-01-20 11:14:05.0  )
త్వరలో టీడీపీ ఖాళీ కాబోతోంది.. బుద్ధా వెంకన్నకు కేశినేని స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ ఎంపీ కేశినేని నాని టీడీపీని వీడి వైసీపీలో చేరారు. అంతేకాదు విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వైసీపీ నుంచి ఆయన ఖరారు అయ్యారు. దీంతో టీడీపీ నేతలు, కేశినేని నాని మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇవాళ ఉదయం టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ ద్వారా కేశినేని నానిపై విమర్శలు కురిపించారు. కేశినేని నానికి టీడీపీ అధినేత చంద్రబాబు, సీఎం జగన్ ఇచ్చిన గౌరవం ఇదంటూ ట్విట్టర్‌లో వీడియో విడుదల చేసి మరీ విమర్శలు కురిపించారు.

ఇందుకు ఎంపీ కేశినేని నాని కూడా స్పందించారు. బుద్ధా వెంకన్నను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పెండ్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేశినేని నాని మాట్లాడుతూ కాల్ మనీ కేటుగాళ్లు, సెక్స్ రాకెట్, అక్రమ వ్యాపారాలు చేసే వారి మాటలకు తాను స్పందించాల్సిన అవసరం లేదని కేశినేని నాని వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్థాయి వ్యక్తుల విమర్శలకు మాత్రమే తాను సమాధానం చెబుతానన్నారు. తెలుగుదేశం పార్టీ త్వరలో ఖాళీ కాబోతుందని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందని కేశినేని నాని జోస్యం చెప్పారు.

Read More..

కేశినేని నాని కోవర్టు.. బుద్దా వెంకన్న సంచలన ట్వీట్

Advertisement

Next Story