- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anantapur: ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే..
దిశ కళ్యాణదుర్గం: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సారథ్యంలో ఏబీసీడీ వర్గీకరణ కోసం ఏప్రిల్ 4న విజయవాడలో మాదిగ సంగ్రామ పాదయాత్ర తలపెట్టారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహిస్తున్నారు. అనంతపురం జిల్లాలో నాలుగు రోజులు క్రితం ప్రారంభమైన ఈ పాదయాత్ర తాజాగా కంబదూరుకు చేరుకుంది.
ఎస్సీ వర్గీకరణ చేయాల్సిందే..
ఈ సందర్భంగా కంబదూరు ఆర్టీసీ బస్టాండు వద్ద అంబేద్కర్ విగ్రహం నుంచి చెక్ పోస్ట్ సర్కిల్ లక్ష్మిదేవమ్మ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఎస్సీలను ఏబీసీడీలుగా వర్గీకరించాల్సిందేనని నినాదాలు చేశారు. అప్పటి వరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, నియోజకవర్గ, మండల ఎమ్మార్పీఎస్ నాయకులు, దళిత నాయకులు, వాల్మీకి సేవా సమితి నియోజకవర్గ నాయకులు ములకనూరు గోవింద్, ఎంపీటీసి మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.