ఒక అమ్మాయితో ప్రేమ, మరో అమ్మాయితో పెళ్లి.. చివరికి ఊహించని ట్విస్ట్

by Seetharam |
ఒక అమ్మాయితో ప్రేమ, మరో అమ్మాయితో పెళ్లి.. చివరికి ఊహించని ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా జాబ్ చేస్తున్న రమేష్ అనే యువకుడు ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పాడు. అతని మాటలు గుడ్డిగా నమ్మిన ఆ యువతి ప్రేమలోతుల్లో మునిగిపోయింది. చివరికి ఆ యువకుడు వేరే అమ్మాయితో షాదీకి సిద్ధపడి ప్రేమించిన అమ్మాయికి హ్యాండిచ్చిన ఘటన అనంతపురం జిల్లా గుత్తి మండలంలో చోటుచేసుకుంది.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన ఓ అమ్మాయి ఇసురాళ్లపల్లిలో తమ బంధువుల ఇంటికి వస్తూ.. వెళుతుండే క్రమంలో అదే గ్రామానికి చెందిన రమేష్ తనని ప్రేమిస్తున్నానని, పెళ్లి కూడా చేసుకుంటానని మాయ మాటలు చెప్పి వెంటపడ్డాడు. ఆమె కూడా అతడి ప్రేమను ఒప్పుకోగా కొన్ని రోజులు చెట్టాపట్టాలేసుకుని ఎంజాయ్ చేశారు. ఇక పెళ్లి చేసుకుంటానని నమ్మించిన అమ్మాయిని మోసం చేసిన రమేష్.. పెద్దవడుగూరు మండలం వీరేపల్లికి చెందిన మరో అమ్మాయితో మ్యారేజ్‌కి సిద్ధపడ్డాడు. ఈ మేరకు ఇసురాళ్లపల్లిలోని ఆనందాశ్రమంలో షాదీ జరుగుతున్న విషయాన్ని తెలుసుకున్న బాధితురాలు గుత్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో రమేష్‌ని పిలిపించిన పోలీసులు విచారించారు. ఇది తెలుసుకున్న వధువు తల్లిదండ్రులు అతడు తన ప్రేమను దాచి మమ్మల్ని కూడా మోసం చేశాడంటూ అతనిపై ఫిర్యాదు చేసి ఊహించని షాక్ ఇచ్చారు. ఇక ఇరువురి ఫిర్యాదు మేరకు రమేష్‌తో పాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Next Story