విశాఖలో దారుణం.. రోడ్డుపై మంటలంటుకుని మహిళకు తీవ్ర గాయాలు

by srinivas |   ( Updated:2024-12-04 10:36:10.0  )
విశాఖలో దారుణం.. రోడ్డుపై మంటలంటుకుని మహిళకు తీవ్ర గాయాలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ శ్రీనివాసనగర్‌(Visakha Srinivasanagar)‌లో దారుణం జరిగింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న అంగన్‌వాడీ టీచర్‌(Anganwadi Teacher)కు అనుమానాస్పదంగా మంటలంటుకున్నాయి. దీంతో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే మంటలాల్పడంతో ప్రమాదం తప్పింది. అయితే ఘటనపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రోడ్డుపై వెళ్తున్న మహిళకు ఒక్కసారిగా మంటలు ఎలా అంటున్నాయనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఘటనా స్థలంలో పెట్రోల్ అనవాళ్లు, అగ్గిపుల్లలు కనిపించినట్లు తెలుస్తోంది. పోలీసులు అనుమానాస్పద ఘటన కేసుగా దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుపైకి పెట్రోల్ ఎలా వచ్చిందని.. ముందుగానే ప్లాన్ ప్రకారం ఎవరైనా పోశారా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. అయితే రోడ్డుపై ఒక్కసారిగా జరగడంతో స్థానికంగా కలకలం రేగింది.

Advertisement

Next Story

Most Viewed