- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tension: తాడిపత్రికి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. ఉద్రిక్తత
దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి మధ్య గొడవలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే జేసీ ప్రభాకర్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించి కేతిరెడ్డి పెద్దారెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రికి వస్తే గుడ్డలూడదీసి కొడతామని జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ ఉదయం తాడిపత్రి వెళ్లారు. ఎన్నికల సమయంలో తాడిపత్రిలో జరిగిన ఘర్షణ నేపథ్యంలో పెద్దారెడ్డికి బెయిల్ మంజూరు అయింది. ఇందుకు సంబంధించి తాడిపత్రి పోలీస్ స్టేషన్‌కు ఆయన వెళ్లారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి బస్టాండ్ సమీపంలో 2 గంటలపాటు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీస్ స్టేషన్ లో పని అయిపోయిన తర్వాత పెద్దారెడ్డి అనంతపురం వెళ్లిపోయారు.
అయితే జేసీ ప్రభాకర్ రెడ్డిపై కేతిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడిపత్రి జేసీ జాగీరా అని ప్రశ్నించారు. తనను బహిష్కరించడానికి జేసీ ఎవరని నిలదీశారు. తమ అంతుచూస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జేసీకి సైతం కుటుంబ సభ్యులు ఉన్నారనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. జేసీ వాహనాలపై తాను ఫిర్యాదు చేయలేదని పెద్దారెడ్డి పేర్కొన్నారు.