- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహిళలకి నెలకు ఐదు వేలు అందించే యాప్.. కానీ అది జరగాలంటే..?
దిశ వెబ్ డెస్క్: ఆలు లేదు చూలు లేదు కానీ కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఉంది ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ తీరు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు అధికారంలోకి వచ్చాక అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పడం సర్వసాధారణం. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా ఇలానే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రతి పేద మహిళకు నెలకు ఐదువేల రూపాయలు ఇస్తామని చెప్పారు.
అయితే అసలు ఎన్నికలు జరగకముందే పేద మహిళలకు నెలకు ఐదు వేలు రూపాయలు ఇచ్చేలా ఓ యాప్ ని రూపొందించారు. ఈ విషయంపై తాజాగా వైఎస్ షర్మిల ట్విట్టర్(X) వేదికగా స్పందించారు. రాష్ట్రంలోని పేద ఆడబిడ్డలకు ప్రతి నెల 5వేల రూపాయలు ఇచ్చే ఉద్దేశంతో తీసుకొచ్చిన 'ఇందిరమ్మ అభయం' పథకం యాప్‌ను లాంఛ్ చేయడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అర్హులైన కొంతమంది మహిళల వివరాలు అందులో పొందుపర్చడం జరిగిందని తెలిపారు. అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరించడం జరుగుతుందని వెల్లడించారు. కానీ ఈ పథకం అమలు కావాంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని తెలియచేసారు.పేద కుటుంబాలకు అండగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ ఈ పథకాన్ని ప్రారంభించిందని హర్షం వ్యక్తం చేశారు. అయితే రానున్న ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రజల ఓట్లకు యాప్ ను వైఎస్ షర్మిల ఎరగా వేస్తుందని విశ్లేషకులు చెబుతున్నారు.
రాష్ట్రంలోని పేద ఆడబిడ్డలకు ప్రతి నెల 5వేల రూపాయలు ఇచ్చే ఉద్దేశంతో తీసుకొచ్చిన 'ఇందిరమ్మ అభయం' పథకం యాప్‌ను లాంఛ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అర్హులైన కొంతమంది మహిళల వివరాలు అందులో పొందుపర్చడం జరిగింది. అర్హులైన ప్రతి మహిళ వివరాలు ఈ యాప్ ద్వారా సేకరించడం జరుగుతుంది. ఈ పథకం అమలు… pic.twitter.com/nSE1w4QQ1l
— YS Sharmila (@realyssharmila) March 10, 2024