వైసీపీలో చేరిన అంబటి రాయుడు: కండువా కప్పిన సీఎం జగన్

by Seetharam |   ( Updated:2023-12-28 12:50:45.0  )
వైసీపీలో చేరిన అంబటి రాయుడు: కండువా కప్పిన సీఎం జగన్
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడుకు వైసీపీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు ఉన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాజీ క్రికెటర్ అంబటి రాయుడుకు వైసీపీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిలు ఉన్నారు. ఇకపోతే అంబటి రాయుడు వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేస్తారని తెలుస్తోంది. గుంటూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి అంబటి రాయుడు వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని తెలుస్తోంది. టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు పొలిటికల్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అనంతరం అంబటి రాయుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్‌తో పలుమార్లు భేటీ అయ్యారు. అలాగే గుంటూరులో పలు ప్రాంతాల్లో పర్యటించారు. అదే సందర్భంలో వైఎస్ జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రశంసిస్తూ వచ్చారు. అంతేకాదు వైసీపీ సోషల్ మీడియాను ఫాలో అవుతూ వస్తున్న సంగతి తెలిసిందే. దీంతో అంబటి రాయుడు వైసీపీలో చేరుతారని అంతా ప్రచారం జరిగింది. అంతా ఊహించినట్లే అంబటి రాయుడు వైసీపీలో చేరారు. ఇకపోతే అంబటి రాయుడు సొంత ఊరు గుంటూరు జిల్లా పొన్నూరు. పొన్నూరులో నివసిస్తూ గ్రామ గ్రామాన తిరిగారు. ప్రభుత్వం అందిస్తున్న సేవాకార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు ప్రస్తుత రాజకీయాలపై పూర్తి అధ్యయనం చేశారు. అన్నీ అధ్యయనం చేసిన తర్వాత ఇక రాజకీయాల్లోచేరాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed