- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ఊపందుకుంటోంది.. ఆళ్ల రామకృష్ణారెడ్డి
దిశ వెబ్ డెస్క్: ఈ రోజు మీడియాతో మాట్లాడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి ఫోటోను వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోమన్ రెడ్డి ఎలా వాడుకున్నారో.. అలానే అవసరం తీరిన తరువాత ఆ ఫోటోను ప్రస్తుతం ఎక్కడ ఉంచారో ప్రతిదీ ప్రజలకు తెలుసని జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహనీయుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనకు నేడు ఉన్నజగన్ పైశాచిక పాలనకు మధ్య ఉన్న తేడాను ప్రజలు భేరీజు వేసుకుంటున్నారని పేర్కొన్నారు .
ఇక ప్రచారం మాత్రమే చేస్తారా లేక పోటీ చేస్తారా అనే ప్రశ్నలకు వైఎస్ షర్మిల ధీటైన సమాధానం ఇస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా మరో రెండు మూడు రోజుల్లో వైఎస్ షర్మిలమ్మా పర్యటించనున్నారని తెలిపారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ ని ఏఐసీసీ షర్మిలకు ఇవ్వనుందని పేర్కొన్నారు. ఇక వైసీపీ, టీడీపీ వైకిరితో అసంతృప్తికి లోనైన వారంతా కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని హర్షం వ్యక్తం చేశారు. ఇక తాను కూడా ఈ రోజు కాంగ్రెస్ లో చేరున్నట్లు స్పష్టం చేశారు. వైఎస్ షర్మిల నాయకత్వంలో కాంగ్రెస్ ఊపందుకుంటుందనే నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు.