చంద్రబాబుపై అత్యాచారం కేసు తప్ప అన్ని సెక్షన్లూ పెట్టారు: కేంద్ర మాజీ మత్రి అశోక్ గజపతిరాజు

by Seetharam |   ( Updated:2023-10-13 12:21:37.0  )
చంద్రబాబుపై అత్యాచారం కేసు తప్ప అన్ని సెక్షన్లూ పెట్టారు: కేంద్ర మాజీ మత్రి అశోక్ గజపతిరాజు
X

దిశ, డైనమిక్ బ్యూరో : దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదేనని కేంద్రమాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. రాష్ట్రంలో సీఎంగా జగన్ బాధ్యతలు తీసుకున్నాక ప్రజల హక్కులు హరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం రాజమహేంద్రవరంలోనే ఉంటున్న ఆయన సతీమణి భువనేశ్వరిని అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో వచ్చి పరామర్శించారు. అనంతరం అశోక్ గజపతి మీడియాతో మాట్లాడారు.‘చంద్రబాబును అరెస్టు చేసిన రోజున ఆయనపై రేప్ కేసు తప్ప అన్ని సెక్షన్లూ చూపించారు. అక్రమంగా జైల్లో పెట్టిన వ్యక్తికి కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వరా? చంద్రబాబు పట్ల ఈ ప్రభుత్వం అమానుషంగా వ్యవహరిస్తోంది..ఇది సైకో వ్యవహారం కాక మరేమిటి? చంద్రబాబు నాయుడు ఎందులోనూ దోషి కాదు. ధర్మం ప్రకారం చంద్రబాబు రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే నాయకుడు. ప్రజాస్వామ్య కృషికి పాడుపడే వ్యక్తికి ప్రజాస్వామ్య వ్యతిరేకులు అడ్డు తగులుతున్నారు. దేశంలో పార్లమెంట్ కూడా ఉంది..ప్రతిపక్ష నేతలను లోపలేసి పార్లమెంట్ నడుతుపుతున్నారా.? ఏంటి ఈ తమాషాలు.? చంద్రబాబు పర్యటనలో దాడులు చేస్తున్నారు..ఎన్ఎస్జీ సిబ్బందికి కూడా గాయాలవుతున్నాయి. వైసీపీ మంత్రులు చట్టవిరుద్ధంగా రోడ్లపై చొక్కాలిప్పుతున్నారు..డ్యాన్సలు వేస్తున్నారు. కానీ వారిపై కేసులుండవు. రాష్ట్రంలో జరిగే పరిస్థితులు కేంద్రం ఎన్ని రోజులు గమనిస్తుందో గమనించనీయండి. పరిస్థితులు గమనించి...రాజ్యాంగాన్ని అమలు చేయడం కేంద్రం ధర్మం’ అని అశోక్ గజపతిరాజు అన్నారు.

చంద్రబాబుకు డీహైడ్రీషన్

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు జైల్లో సదుపాయాలు ప్రభుత్వమే ఇవ్వాలి. ఒక వ్యక్తిని జైల్లో పెట్టేది కరోనా అంటించి, డీహైడ్రేషన్ అవ్వడానికా.? అని కేంద్రమాజీమంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. హత్యలు చేసిన వాళ్లకు మంచినీళ్లు ఇస్తున్నారు. చంద్రబాబుకు డీహైడ్రీషన్ అంటే బాడీలో ఫ్లూయిడ్స్ తగ్గినట్లే అని వ్యాఖ్యానించారు. మన దురదృష్టం ప్రకారం ప్రజలకు సీఎంగా సైకో వ్యక్తి తగిలారు అని అశోక్ గజపతిరాజు వ్యాఖ్యానించారు. రాష్ట్రం గంజాయితో నిండిపోయింది. ఏం మాట్లాడినా ఈ సైకో జైలు పాలుజేస్తున్నాడు. ఎన్నిసార్లు సుప్రీం మొట్టికాయలు వేసినా ఈ ముఖ్యమంత్రి మారలేదు అని హెచ్చరించారు. రాజధాని అంశాన్ని ఇంకా లాగుతూనే ఉన్నాడు. రాజ్యాంగంలోని అన్ని హక్కులను హరిస్తున్నాడు అని ధ్వజమెత్తారు.. అందుకే అందరూ సైకో అని పిలుస్తున్నారు అని మండిపడ్డారు. జగన్ పై సీబీఐ విచారణ చేసినప్పుడు ఎన్నోసార్లు పరిశీలించి, మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని నిర్థారించుకున్న తర్వాత రిమాండ్‌కు పంపారు అని మండిపడ్డారు. అదే సీబీఐ ఇప్పుడు మన రాష్ట్రంలో సరిగా పని చేస్తోందా.? అవినాష్ రెడ్డిని వివేకా హత్య కేసులో అరెస్టు చేయడానికి కర్నూలు వచ్చినప్పుడు ఆసుపత్రిలో దాచిపెట్టి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. ఇలాగే ప్రభుత్వాలు నడుస్తాయా...చట్టాలు ఎవరికీ చుట్టాలు కాదు. మన దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం అందరి ధర్మం. మొరార్జీ దేశాయ్, వాజ్ పేయ్ కూడా జైలుకు వెళ్లి వచ్చారు. చంద్రశేఖర్ కూడా జైలుకెళ్లొచ్చాక ప్రధాని అయ్యారు. 16 నెలలు జైల్లో ఉండి బెయిల్ పై వచ్చి చట్టాన్ని ఎలా చుట్టంగా మార్చుకోవాలో నేర్పిస్తున్నారు. ప్రజాస్వామ్యానికి ఇది మంచిది కాదు. గతంలో అచ్చెన్నాయుడును అరెస్టు చేయించి కరోనా తగిలించి, ఫైల్స్ ఆపరేషన్ కూడా చేయించుకోనీలేదు. ప్రస్తుత ప్రభుత్వాలు ఆఖరి దశకు వచ్చాయి..మళ్లీ మీరు ఉంటారని మేము నమ్మడం లేదు. ఇప్పుడైనా కనీసం రాగధ్వేషాలకు అతీతంగా పని చేయాలి. టీడీపీని ఎన్టీఆర్ తెలుగువారి కోసం స్థాపించారు. తెలుగు ప్రజల కోసం టీడీపీ ఎప్పుడూ పోరాడుతూనే ఉంటుంది’ అని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed