- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శ్రీవారి భక్తులకు అలర్ట్..టీటీడీ కీలక ప్రకటన అది ఏంటంటే?
దిశ,వెబ్ డెస్క్:తిరుమలకు వెళ్లే భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది.అది ఏంటంటే..తిరుమల శ్రీ తుంబురు తీర్థం ముక్కోటి ఉత్సవాలు ఈ నెల 24, 25 వ తేదీల్లో ఘనంగా నిర్వహిస్తారు.ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.ఈ క్రమంలోనే తుంబురు తీర్థానికి మార్చి 24వ తేదీ ఉదయం 5 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు, మార్చి 25వ తేదీన ఉదయం 5 నుంచి 11 గంటల వరకు మాత్రమే భక్తులను అనుమతిస్తారని టీటీడీ అధికారులు పేర్కొన్నారు.అలాగే భక్తులకు పాపవినాశనం డ్యామ్ వద్ద అల్పాహారం, అన్నప్రసాదాలు, త్రాగునీరు అందిస్తారు.
ఫస్ట్ ఎయిడ్ కేంద్రాలు, అంబులెన్సులు, మందులు, పారామెడికల్ సిబ్బంది అందుబాటులో ఉంచనున్నారు.తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సింది వస్తుంది. కావున గుండె, శ్వాసకోశ సమస్యలు, స్థూలకాయం ఉన్నవారికి అనుమతి లేదని తెలిపారు.ఈ విషయాన్ని భక్తులు గమనించాలని పేర్కొన్నారు.భక్తులు వంట సామగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.పోలీసుశాఖ, అటవీశాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాపవినాశనం నుంచి తుంబురు తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు.