- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిరుమల భక్తులకు అలర్ట్.. నేడు ఆ దర్శనాలను రద్దు చేసిన టీటీడీ
దిశ, వెబ్‌డెస్క్: బంగాళఖాతంలో ఏర్పడిన వాయుగుండం(Vayugundam) ప్రభావంతో తమిళనాడు, ఆంద్రప్రదేశ్, కేరళ, పుదుచ్చెరి లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.ఈ వాయుగుండం ఆగ్నేయ బంగాళాఖాతం(Southeast Bay of Bengal)లో కేంద్రీకృతం అవ్వగా.. పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుంది. చెన్నైకి 490 కి.మీ., పాండిచ్చేరికి 500 కి.మీ., నెల్లూరుకు 590 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ఈ నెల 17న పాండిచ్చేరి - నెల్లూరు మధ్య తీరం దాటే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. కాగా దీని ప్రభావంతో ఏపీలోని తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో రెండు రోజులు తిరుపతి(Tirupati), చిత్తూరులో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. ఒక్క రోజులోనే 20 సెంటి మీటర్ల వర్షం పడొచ్చని అంచనా వేయడం తో అప్రమత్తమైన ప్రభుత్వం ప్రత్యేక బృందాలతో సిద్ధంగా ఉంది. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతిలోని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు నేడు వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ముందస్తుగానే ప్రకటించింది. అలాగే ఘాట్ రోడ్లలో కొండచరియలు విరిగి పడే అవకాశం ఉండటంతో ముందస్తుగా.. జేసీబీలు, బుల్డోజర్లు, అంబులెన్సులను సిద్ధం చేశారు.