- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
నిరుద్యోగులకు బిగ్ అలర్ట్.. మెగా డీఎస్సీతో పాటు టెట్ నిర్వహణ
దిశ, వెబ్‌డెస్క్: టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)అభ్యర్థుల కోసం ఏపీ సర్కారు తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ నాటికి మెగా డీఎస్సీ పూర్తి చేయాలని విద్యాశాక డెడ్ లైన్ పెట్టుకుంది. కాగా ఏపీ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మెగా డీఎస్సీ దస్త్రంపైనే తొలి సంతకం చేసిన విషయం తెలిసిందే. దీంతో విద్యాశాఖ కసరత్తు స్టార్ట్ చేసింది. మెగా డీఎస్సీతో పాటు టెట్ నిర్వహించాలని సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఫిబ్రవరి-మార్చిలో నిర్వహించిన టెట్ లో పాస్ కాని అభ్యర్థులు, తాజాగా B.ed, D. ed పూర్తి చేసిన వారి కోసం ఈ నిర్ణయం తీసుకుంది. తొలుత టెట్ నిర్వహించి తర్వాత డీఎస్సీ ప్రిపరేషన్ కు 30 రోజుల టైమ్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. కాగా జులై 1 వ తేదీ నుంచి ఈ టెట్ అప్లికేషన్‌కు నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహిం చే అంశాన్ని కూడా ఏపీ నూతన ప్రభుత్వం తీసుకురానుంది. ఇక విద్యాశాఖగా మంత్రి లోకేష్ బాధ్యతలు నిర్వహిస్తున్న సంగతి తెలసిందే.