- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఓటమి అనంతరం వైఎస్ విజయమ్మ..జగన్‌కి కనీసం ఫోన్ కూడా చేయలేదంట..కారణం ఏంటంటే?
దిశ,వెబ్‌డెస్క్:ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం చెందింది. కేవలం 11 స్థానాలకే పరిమితం అయింది. వాస్తవానికి ఈ ఎన్నికల్లో వైసీపీ దారుణ ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ నుంచి కిందిస్థాయి కార్యకర్త వరకు ఈ షాక్ నుంచి కోలుకోలేదు. వైసీపీ శ్రేణులు గతంలో వచ్చిన సీట్లు రాకపోయినా కనీసం 90 నుంచి వంద స్థానాలు వస్తాయని అంచనా వేశారంట. కానీ భారీ అపజయాన్ని అస్సలు ఊహించలేదని అనుకుంటున్నారు.
అయితే వైసీపీ ఘోర ఓటమితో వైఎస్ జగన్ బాధపడుతుంటే కుమారుడిని ఓదార్చే ప్రయత్నం విజయమ్మ చేసే ప్రయత్నం చేయలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. తన కుమారుడు ఓటమితో కుంగిపోతాడని భావించి విజయమ్మ తాడేపల్లి జగన్ నివాసానికి రావాలి. కానీ ఆమె రాకపోగా కనీసం ఫోన్ చేసి ఓదార్చే ప్రయత్నం కూడా చేయలేదని పార్టీ సీనియర్ నేత వాపోయారు. జగన్‌తో మాట్లాడే ధైర్యం లేకనే విజయమ్మ ఫోన్ చేయడానికి కూడా ప్రయత్నించలేదని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఎన్నికల ప్రచార సమయంలో వైఎస్ విజయమ్మ కుమారుడు, కుమార్తె మధ్య రాజకీయంగా నలిగిపోలేక అమెరికాలోని మనవడి వద్దకు వెళ్లి పోయిన విషయం తెలిసిందే. అమెరికా వెళ్లిన వైఎస్ విజయమ్మ తన కూతురు షర్మిలను కడప పార్లమెంటు నియోజకవర్గంలో గెలిపించాలని వీడియో విడుదల చేయడంతో జగన్ తట్టుకోలేకపోయారని అంటున్నారు. ఈ సమయంలో ఏం మాట్లాడి ఎలా ఓదార్చాలో కూడా తెలియని విజయమ్మ ఆ దిశగా ప్రయత్నం చేయలేదని మరికొందరు చెబుతున్నారు. ఆదివారం వైఎస్ విజయమ్మ ఆమెరికా నుంచి వచ్చి హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. అనంతరం తాడేపల్లిలోని జగన్ నివాసానికి వెళ్లనున్నట్లు సమాచారం.