- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Little Gandhi: మంత్రిని కదిలించిన వీడియో.. ఆ బుడ్డోడి పరిస్థితి చూస్తే కన్నీరు ఆగదు (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్: చదువుకోవాల్సిన పసి వయసులో అనేక మంది చిన్నారుల జీవితాలు నాశనం అవుతున్నాయి. కొందరి డబ్బు పిచ్చి కారణంగా అభం శుభం తెలియని బాలలు కార్మికులుగా తయారవుతున్నారు. మరి కొందరైతే భిక్షాటన చేయిస్తూ వారి బాల్యాన్ని రోడ్డున పడేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని కర్నూలులో వెలుగుజూసింది. ఈ సంఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కర్నూలులో గాంధీ వేషాధారణలో ఓ బాలుడు రోడ్డు పక్కనే అడుక్కుంటున్నాడు. భయంకరంగా నిద్ర వస్తున్నా తట్టుకొని అందరివైపు దీనంగా చూస్తున్నాడు. అక్కడే ఉన్న కొందరు బాలుడి పరిస్థితిని చూసి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. తాజాగా ఈ ఘటనపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ఆ వీడియో చూడగానే తన గుండె తరుక్కుపోయిందన్న మంత్రి వెంటనే బాలుడిని సంరక్షిస్తామని, ఆ పని చేయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
తల్లి ఒడిలో ఆడుకోవాల్సిన వయసులో రోడ్డుపై అడుక్కుంటూ
— Telugu Scribe (@TeluguScribe) November 20, 2024
కర్నూలులో రెండేళ్లు నిండని ఓ పసి బాలుడిని గాంధీ వేషం వేసి రోడ్డుపై అడుక్కోవడానికి పడేశారు.
ఈ ఘటనపై సంధించిన మంత్రి నారా లోకేష్ పిల్లాడిని రక్షిస్తాం, నిందితుడిని శిక్షిస్తాం అంటూ ట్వీట్ చేశాడు. pic.twitter.com/5f5GC6y6m4