సొంత కార్యకర్తపై చేయి చేసుకున్న అధికార పార్టీ MLA

by GSrikanth |
సొంత కార్యకర్తపై చేయి చేసుకున్న అధికార పార్టీ MLA
X

దిశ, ఉత్తరాంధ్ర: అనకాపల్లి జిల్లా పూడిమడక ‘గడప గడపకు’ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నబాబు పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్నారు. వైసీపీ ప్రభుత్వంలో నెరవేరని హామీల గురించి ప్రశ్నించిన వ్యక్తిపై ఎలమంచిలి వైసీపీ ఎమ్మెల్యే కన్నబాబు దాడి చేశాడు. సొంత పార్టీ శ్రేణులే ఎమ్మెల్యేపై తిరుగుబాటుకు దిగడంతో ఎమ్మెల్యే కన్నబాబు సహనం కోల్పోయి దాడికి పాల్పడటంతో కార్యకర్తలంతా ఎమ్మెల్యేపై విరుచుకుపడ్డారు. హామీలు నెరవేర్చకపోవడమే కాకుండా ప్రశ్నించిన సొంత పార్టీ కార్యకర్తపై చేయి చేసుకోవడం ఏంటని మండిపడ్డారు. ‘ఎమ్మెల్యే గో బ్యాక్’ అంటూ నినాదాలు చేశారు. ఎన్నికల దగ్గర పడుతున్న వేళ ప్రభుత్వంపై వైసీపీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

Advertisement

Next Story