- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీ అసెంబ్లీ చరిత్రలో కొత్త రికార్డు... 80 శాతం ఎమ్మెల్యేలపై కేసులు
దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ చరిత్రలో కొత్త రికార్డు నమోదు అయింది. అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేల్లో 80 శాతం మందిపై కేసులు ఉన్నాయి. అదీకూడా గత జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులేకావడంతో అసెంబ్లీలో సరికొత్త చరిత్ర నమోదు అయింది. జగన్ ప్రభుత్వంలో శాంతి భద్రతలపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శ్వేత పత్రం విడుదల చేశారు. ఈ సందర్బంగా జగన్ ప్రభుత్వంపై పెట్టిన కేసుల అంశం ప్రస్తావనకు వచ్చింది. జగన్ హయాంలో అక్రమ కేసులు బాధితులు లేచి నిలబడాలని చంద్రబాబు కోరారు. దాదాపు ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. కొద్ది మాత్రమే తమపై కేసులు లేవని తెలిపారు. దీంతో అందరం జగన్ బాధితులమంటూ చంద్రబాబు సెటైర్లు వేశారు. ఇక తనపై 17 కేసులు, పవన్ 7 కేసులు పెట్టారని, చివరకు స్పీకర్ ను కూడా వదిలిపెట్టలేదని చంద్రబాబు తెలిపారు. ఇదీ జగన్ ప్రభుత్వంలో శాంతి భద్రతల పరిస్థితి అని చంద్రబాబు విమర్శించారు.