- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బాలికపై ఘోరం: ప్రేమ పేరుతో లాడ్జికి తీసుకెళ్లి...ఒకరి తర్వాత ఒకరు..
దిశ, డైనమిక్ బ్యూరో : ప్రేమించానని వెంటపడ్డాడు. అయినప్పటికీ ఆ బాలిక దూరంగానే ఉండేది. బాలికను తనవైపునకు తిప్పుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశాడు. చివరకు ప్రయత్నాలు ఫలించాయి. అతడి ప్రేమ నిజమని నమ్మింది. అయితే ఒకసారి ఏకాంతంగా కలుద్దాం రావాలి అని ప్రియుడు ఒత్తిడి పెంచాడు. దీంతో ఆ బాలిక సరే అని అతడి మాటలు నమ్మి వెళ్లింది. ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. అనంతరం ప్రియుడు తన సోదరుడిని పిలిపించి అతడి కోరిక కూడా తీర్చాలని ఒత్తిడి పెంచాడు. అనంతరం ఇద్దరూ ఒకరితర్వాత ఒకరు అత్యాచారం చేశారు. ఈ అవమానం తట్టుకోలేక..ప్రియుడి మోసాన్ని భరించలేక ఆ బాలిక ఆత్మహత్యకు పాల్పడింది. ఈ షాకింగ్ ఘటన కృష్ణా జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం కృష్ణా జిల్లాలోని పామర్రు సమీపంలోని ఓ దళిత వాడకు చెందిన 14 ఏళ్లబాలిక స్థానికంగా ఉండే ఓ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అయితే ఆబాలికపై కొండిపర్రుకు చెందిన లోకేశ్ అనే యువకుడు కన్నేశాడు. ప్రేమ పేరుతో వెంట పడ్డాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. లోకేశ్ మాటలు నమ్మిన మైనర్ బాలిక అతడితో చనువు పెంచుకుంది. అయితే ఈ నెల 20న లోకేశ్ బాలికకు ఫోన్ చేసి ఇద్దరం కలిసి ఏకాంతంగా గడుపుదామని కోరాడు. అందుకు తొలుత బాలిక ఒప్పుకోలేదు. ఏలాగోలా బతిమిలాడి ఒప్పించాడు. ఎక్కడ కలవాలో అడ్రస్ కూడా చెప్పాడు. దీంతో బాలిక రోజులాగే స్కూల్‌కి వెళ్తున్నానని చెప్పి బ్యాగ్ తీసుకుని ఇంటి నుంచి బయలుదేరింది. స్కూల్ బయట బ్యాగ్‌ను వదిలేసి రోడ్డుపైకి వెళ్లింది. అక్కడ ఓ యువకుడిని లిఫ్ట్ అడిగి..ప్రియుడు లోకేశ్ చెప్పిన విజయవాడ-మచిలీపట్నం నేషనల్ హైవే దగ్గరకు చేరుకుంది. అక్కడకు చేరుకున్న లోకేశ్ మైనర్ బాలికన బైక్ ఎక్కించుకుని ఉయ్యూరులోని ఓ లాడ్జికి తీసుకెళ్లాడు. ఇద్దరూ ఏకాంతంగా గడిపారు. అనంతరం లోకేశ్ తనకు సోదురుడి వరస అయ్యే నరేంద్రకు ఫోన్ చేసి తాను ఉన్న లాడ్జికి రావాలని అడ్రస్ షేర్ చేశాడు. నరేంద్ర వచ్చిన తర్వాత ఇద్దరూ మరోసారి బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు.
ఎలా బయటపడిందంటే?
మైనర్ బాలిక స్కూల్‌కి వెళ్లకుండా స్కూల్ బయట బ్యాగ్ పెట్టేసి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని స్కూల్ వాచ్‌మెన్ గమనించి హెచ్‌ఎం దృష్టికి తీసుకెళ్లాడు. హెచ్ఎం ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలియజేశారు. దీంతో వెంటనే బాలిక తల్లి స్కూల్ వద్దకు చేరుకుని బోరున విలపించింది. అటు స్కూల్ సిబ్బంది, బాలిక తల్లి ఎవరు బైక్ ఎక్కి వెళ్లింది అని ఆరా తీశారు. లిఫ్ట్ ఇచ్చిన యువకుడిని ప్రశ్నించగా తాను హైవే సమీపంలోని బ్రిడ్జి వద్ద దించానని తెలిపాడు. అయితే అక్కడ దించిన తర్వాత తన సెల్ ఫోన్ నుంచి లోకేశ్ అనే వ్యక్తికి కాల్ చేసిందని తెలిపాడు.అనంతరం తాను అక్కడ నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. ఆ యువకుడి దగ్గర లోకేశ్ నంబర్ తీసుకున్న బాలిక తల్లిదండ్రులు అతడికి ఫోన్ చేసి నిలదీశారు. దీంతో కంగారుపడ్డ లోకేశ్ లాడ్జిలో నుంచి బాలికను తీసుకొని ఆమె ఇంటికి దగ్గరలో దించేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే బాలిక రాత్రి ఇంటికి వెళ్లలేదు. దీంతో తల్లిదండ్రులు పామర్రు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. లోకేశ్, నరేంద్రలను అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తాను బాలికను ఇంటి దగ్గరలో విడిచిపెట్టానని లోకేష్ పోలీసులకు తెలిపాడు.
మృతదేహం లభ్యం
తల్లిదండ్రులు తిడతారనే భయం ఒకవైపు...ప్రియుడు నమ్మించి మోసం చేయడం..తాను గ్యాంగ్ రేప్‌కు గురవ్వడంతో మైనర్ బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది. దీంతో ఇంటికి వెళ్లకుండా కాల్వలో పడి ఆత్మహత్యకు పాల్పడింది. బాలిక మృతదేహం ఆదివారం మొవ్వ మండలంలోని సూరసానిపల్లి లో ఉన్న కాలువలో లభించింది. తనపై జరిగిన ఘోరం తట్టుకోలేక బాలిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితులు లోకేశ్, నరేంద్రలపై పోలీసులు గ్యాంగ్ రేప్, పోక్సో, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు తమ బిడ్డ క్షేమంగా ఇంటికి తిరగి వస్తుందని భావించిన తల్లిదండ్రులు.. కుమార్తెను విగత జీవిగా చూసి కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. నిందితులు లోకేశ్, నరేంద్రలను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.