మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం.. రంగంలోకి CID

by Satheesh |   ( Updated:2024-07-25 12:01:42.0  )
మదనపల్లె ఫైల్స్ దగ్ధం కేసులో కీలక పరిణామం.. రంగంలోకి CID
X

దిశ, వెబ్‌డెస్క్: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్‌లో ఫైల్స్ దగ్ధం కేసులో మరో కీలక పరిణామం చేసుకుంది. ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం కేసు ఇన్విస్టిగేషన్‌కు సీఐడీని రంగంలోకి దించింది. స్వయంగా ఏపీ సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యనార్ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. మొత్తం 60 మంది అధికారులు 6 టీమ్‌లుగా ఏర్పడి ముమ్మరంగా విచారణ చేస్తున్నారు. కేసును త్వరగా ఫినిష్ చేయాలనే లక్ష్యంతో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యనార్ మదనపల్లెలోని మకాం వేశారు.

ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న సీఐడీ వారి నుండి కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. కాగా, మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాయలంలో అగ్ని ప్రమాదం జరిగి పలు కీలకమైన రెవిన్యూ ఫైల్స్ కాలి బూడిదైపోయాయి. అయితే, ఈ ఫైర్ యాక్సిడెంట్ ప్రమాదవశాత్తూ జరిగింది కాదని అనుమానం వ్యక్తం చేస్తోన్న ప్రభుత్వం విచారణకు సీఐడీని రంగంలోకి దించింది. కాలిపోయిన ఫైల్స్‌లో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో చేతులు మారిన విలువైన భూములకు సంబంధించిన పత్రాలు ఉన్నట్లు టాక్.

Advertisement

Next Story