టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. కోర్టులో లొంగిపోయిన ఎమ్మెల్సీ అనుచరుడు

by srinivas |   ( Updated:2024-10-14 09:07:40.0  )
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. కోర్టులో లొంగిపోయిన ఎమ్మెల్సీ అనుచరుడు
X

దిశ, వెబ్ డెస్క్: మంగళగిరి టీడీపీ ఆఫీసు(Mangalagiri TDP Office)పై దాడి కేసులో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(YCP MLC Lella Appireddy) ప్రధాన అనుచరుడు చైతన్య కోర్టులో లొంగిపోయారు. ఇంతకాలం అజ్ఞాతంలో ఉన్న ఆయన ఎట్టకేలకు మంగళగిరి కోర్టులో లొంగిపోయారు. బెయిల్ మంజూరు చేయాలని ధర్మాసనాన్ని కోరారు. టీడీపీ కార్యాలయం దాడిలో చైతన్య ప్రత్యక్షం పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ కేసు విచారణ స్పీడందుకోవడంతో చైతన్య కనిపించకుండా పోయారు. మళ్లీ ఇన్నాళ్టకు బయటకు వచ్చారు.

ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. వైసీపీ మాజీ నాయకులు దేవినేని అవినాశ్‌తో పాటు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం మంగళగిరి పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. తమ సెల్ ఫోన్లు ఇవ్వాలని అడగటంతో నిరాకరించినట్లు పోలీసులు తెలిపారు.

అయితే ఈ కేసును సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కానీ కేసును సీఐడీకి బదిలీ చేస్తున్నట్లు ఆదేశాలు రాకపోవడంతో మంగళగిరి పోలీసులు కేసు విచారణను కొనసాగించారు. ఇక ఇదే కేసులో వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ను ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపిన విషయం తెలిసిందే.

Next Story

Most Viewed