Diamond:రైతు తలరాతను మార్చిన తొలకరి..పొలంలో దొరికిన వజ్రం..ఎక్కడంటే?

by Jakkula Mamatha |
Diamond:రైతు తలరాతను మార్చిన తొలకరి..పొలంలో దొరికిన వజ్రం..ఎక్కడంటే?
X

దిశ,వెబ్‌డెస్క్:రాష్ట్రంలో భారీ వర్షాలు పడటంతో ఆ జిల్లాల్లో వజ్రాల వేట మళ్లీ మొదలైంది. వజ్రం విలువ ఎంత ఉంటుందో అందరికీ తెలిసిందే. ఒక్క వజ్రం దొరికితే లైఫ్ సెటిల్ అవుతుందని వజ్రాల కోసం గాలిస్తున్నారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో ఓ రైతును అదృష్టం వరించింది. చాలా రోజుల తర్వాత పొలంలో వజ్రం దొరికింది. దీంతో ఆ రైతు ఎంతో సంతోష పడ్డాడు. తుగ్గలి మండలం జొన్నగిరిలో పొలం పనులకు వెళ్లిన రైతుకు ఓ వజ్రం దొరకగా ఆయన దాన్ని అమ్మకానికి పెట్టాలని అనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఓ వ్యాపారి రూ.12 లక్షల నగదు, 5 తులాల బంగారం ఇచ్చి కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. రైతుకు వజ్రం దొరకడంతో పొలాల్లో వజ్రాల కోసం గాలింపు మళ్లీ మొదలైంది. కొందరు వజ్రాల వ్యాపారులు ఏజెంట్లను నియమించుకొని మరీ.. పొలాల్లో దొరికిన ఈ వజ్రాలను కొనుగోలు చేస్తున్నారు. వ్యాపారులు రైతులు, కూలీలకు దొరికే వజ్రాలను తక్కువ ధరకు కొనుగోలు చేసి వారు ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు.

Advertisement

Next Story