స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం

by Anjali |
AP government
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ పాలనలో హింసా రాజకీయాలు, అధికార దుర్వినియోగం స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజంపై కూటమి ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు పోలవరంపై తొలి శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. అందులో గత ఏడేళ్ల అరాచకాలు, దాడులు, తప్పుడు కేసులపై బాబు వివరణ ఇవ్వనున్నారు. బాధితులనే నిందితులను చేస్తూ పెట్టిన తప్పుడు కేసులు, కారకులపై నివేదికలను కూటమి ప్రభుత్వం సిద్ధం చేస్తుంది. వైసీపీకి అంటకాగిన అధికారులపై నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకుంటామని కూటమి ప్రభుత్వం తెలిపింది. పోలీసుశాఖ సహా అన్ని శాఖల్లో అధికార దుర్వినియోగంపై డాటా సేకరించనుంది. టీడీపీ ఆఫీసుపై, చంద్రబాబు ఉండవల్లి నివాసంపై, కార్యకర్తల ఇళ్లపై జరిగిన దాడులు, వాటి వెనుక ఉన్న శక్తులపై నేడు చంద్రబాబు ఆరా తీయనున్నారు. నమోదైన కేసులు, ప్రస్తుత స్టేటస్ పైనా ప్రభుత్వ పెద్దలు వేదికలు కోరారు. ఒక్కొక్కటిగా అన్ని అక్కమాలను ప్రజలముందు పెట్టి చట్టబద్ధంగానే చర్యలు తీసుకోవాలనే కూటమి ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఇక నేడు జ్ఞాన్ భూమిలో మాజీ ప్రధాని నర్సింహారావుకు ఘనంగా103 జయంతి ఉత్సవాలు జరిపించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు, ప్రముఖులు, పీవీ కుటుంబసభ్యులు, అధికారులు హాజరయ్యారు.

Next Story

Most Viewed