ఇదేం దున్నపోతురా బాబోయ్.. గ్రామాన్ని బెంబేలెత్తిస్తోంది!

by Anjali |
ఇదేం దున్నపోతురా బాబోయ్.. గ్రామాన్ని బెంబేలెత్తిస్తోంది!
X

దిశ, ఫీచర్స్: అచ్చోసిన ఆంబోతు అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం దున్నపోతు. ఇవి ఊళ్లో పంట పొలాల మీద పడి మేస్తుంటాయి. దీంతో కొన్ని దున్నపోతులను ఎవరైనా కోపంలో కొట్టినట్లైతే గుర్తుపెట్టుకుని మరీ వారిపై దాడి చేస్తుంటాయి. ఇలాంటి ఓ దున్నపోతు అనంతపురం జిల్లా కనేకల్ మండలం సొల్లాపూరం లో ఉంది. ఈ దున్నపోతుకు రోడ్డు పై ఎవరైనా మనుషులు కనిపిస్తే తెగ రెచ్చిపోతుందట. పగ పట్టిన పాము వలే ప్రవర్తించడంతో ఊర్లో ఉన్న వారంతా గజగజ వణికిపోతున్నారు. ఈ దున్నపోతును కొట్టిన వారిని గుర్తుపెట్టుకుని మరీ వచ్చి కుమ్మేస్తుంది.

ఈ దున్నపోతు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. పొలాల్లో తిరుగుతూ మేయడం, చేన్లో మేత దొరకపోతే గ్రామంలోని ఇళ్లలోకి వచ్చి ఇంటి సమీపంలో ఉన్న గ్డడి లేదా రైతులు ఇంటి ముందు ఉంచిన ధాన్యం గింటలు తింటుందట. ఈ క్రమంలో దున్నపోతును తరిమికొట్టే ప్రయత్నం చేస్తే వారిని గుర్తుపెట్టుకుని మరీ దాని కొమ్ములతో దాడి చేస్తుందట. తాజాగా అదే గ్రామానికి చెందిన రసూలమ్మకు ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఆ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. గత 6, 7 నెలలుగా ఈ డేంజరస్ దున్నపోతు బారినపడిన వారు 50, 60 మంది వరకు ఉన్నారు.

గ్రామంలో జరిగే ఈ పరిస్థితి గురించి పోలీసులకు, అటవీ శాఖ అధికారులకు, వెటర్నరీ ఆఫీసర్లకు చాలా సార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటూ సొల్లాపూర్ సర్పంచ్ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో దున్నపోతును ఎలాగైనా బంధించాలని లేదా సమీపంలోని అడవిలోకి తరిమేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయం అటవీ శాఖ అధికారుల చెవిన పడటంతో త్వరలోనే మత్తు ఇంజెక్షన్ ఇచ్చి గన్ ద్వారా దున్నపోతును బంధించి.. అడవిలో విడిచిపెడతామని మాట ఇచ్చారు.

Advertisement

Next Story