AP Politics:గుర్తులతో గజిబిజి..గ్లాసుకు తలనొప్పిగా మారిన బకెట్?

by Jakkula Mamatha |
AP Politics:గుర్తులతో గజిబిజి..గ్లాసుకు తలనొప్పిగా మారిన బకెట్?
X

దిశ ప్రతినిధి,కాకినాడ: తమిళనాడు తరహా రాజకీయం రాష్ట్రంలో ముఖ్యంగా పిఠాపురంలో జరగనుంది. ఒకే పేరు గల అనేక మంది పన్నీర్ సెల్వం పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల బరిలోకి దిగారు. వారందరికీ గుర్తును ఎన్నికల సంఘం కేటాయించింది. పన్నీర్ సెల్వంతో పాటు మరో నలుగురు పన్నీర్ సెల్వంలు కూడా నామినేషన్లు వేశారు. వారందరి ఇంటిపేర్లు ఓ అని ఉండటంతో ఓటర్లు కన్ఫ్యూజన్ అవుతారని పన్నీర్ సెల్వం అనుచరులు ఆందోళన చెందుతున్నారు.

ఇదే ఫార్ములా పిఠాపురంలో ప్రత్యర్థులు ఉపయోగించే అవకాశాలున్నాయంటున్నారు.కనుమూరి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చేత నామినేషన్ వేయించేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఆయన నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయించేలా ప్లాన్ వేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో ఇద్దరి ఇంటిపేర్లు K కావడంతో ఓటర్లు తికమక గురయ్యే అవకాశముంది. కొణిదెల పవన్ కల్యాణ్ జనసేన నుంచి కాగా, కనుమూరి పవన్ కల్యాణ్ నవరంగ్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయిస్తే ఓటర్లు తికమకపడి ఓట్లు చీలే అవకాశం ఉందని జనసైనికులు ఆందోళన చెందుతున్నారు.

అదే నిజమయితే...

ఈ విషయం ఇప్పుడు పిఠాపురంలో పెద్దయెత్తున ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు మరొక ప్రమాదం కూడా ఉంది. పవన్ కల్యాణ్ కు గాజు గ్లాసు గుర్తు కూడా కేటాయించే అవకాశముండటంతో ఆ దిశగా కూడా పవన్ ప్రత్యర్థులు ప్రయత్నాలు మొదలు పెట్టారంటున్నారు. ఎక్కువ మంది బరిలో ఉంటే బకెట్ గుర్తు ఎవరో ఒకరికి వచ్చిన, లేదంటే కనుమూరి పవన్ కల్యాణ్‌కు వస్తే ఇక బకెట్ కు,గాజుగ్లాస్ కు పెద్దగా తేడా ఉండదని,అప్పుడు జనసేనానికి పడే ఓట్లు బకెట్ కు పడే అవకాశముందన్న ప్లాన్ చేస్తున్నారట. మరి ఇది నిజమైతే మాత్రం పవన్ కల్యాణ్ మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

జనసేన అభ్యర్థుల పేర్లతోనే బకెట్ గుర్తు అభ్యర్థులు కూడా బరిలో ఉండటం ఆ పార్టీని ఆందోళనకు గురిచేస్తోంది. ఏపీలో ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరింది. ఒక వైపు సీఎం జగన్ మేమంతా సిద్ధం అంటూ జిల్లాల వారీగా బస్సు యాత్రలు చేస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం పర్యటన తర్వాత చంద్రబాబుతో కలిసి ఉభయగోదావరి జిల్లాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఉభయ గోదావరి జిల్లాల్లో ఇరుపార్టీల అధ్యక్షులు తమ సామాజిక వర్గం ఓటర్లను ఆకర్షించేందుకు కలిసి ప్రచారం చేస్తున్నారు. తమను ఎన్నికల్లో పోటీ చేయొద్దంటూ జనసేన బెదిరిస్తోందని నవరంగ్ పార్టీ చీఫ్‌ జలీల్‌ ఆరోపించారు.

ఎన్నికల్లో చిన్న పార్టీలు..

ప్రధాన పార్టీలకు చుక్కలు చూపిస్తుంటాయి . ఎందుకంటే తమ పార్టీ అభ్యర్థుల పేర్లతో బరిలో దిగుతారన్న దిగులు ఓవైపు. అంతకంటే పెద్ద తలనొప్పి ఏంటంటే తమ పార్టీ గుర్తుని పోలిన గుర్తులేమైనా వస్తాయేమో నన్న భయం. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు అలాంటి చిక్కే వచ్చి పడింది. జనసేన రాజకీయంలోకి నవరంగ్‌ కాంగ్రెస్‌ అనే ఓ సీజనల్‌ పార్టీ వచ్చింది.ఇది ప్రస్తుతం జనసేనకు నిద్రలేకుండా చేస్తోంది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లేని పార్టీలకు ప్రకటించిన గుర్తుల్లో నవరంగ్‌ కాంగ్రెస్‌కు బకెట్‌ గుర్తు లభించింది.

దీంతో ఆ పార్టీ పండగ చేసుకుంటుంటే, గాజు గ్లాస్ గుర్తుతో జనసేన నేతలు మాత్రం తలలు పట్టుకుంటున్నారు. తమ గుర్తును పోలిఉన్న బకెట్‌తో పెద్ద ముప్పు ఉందని భావిస్తున్నారు. నవరంగ్‌ పార్టీ ప్రకటించిన అభ్యర్థుల పేర్లు కూడా జనసేన అభ్యర్థులతో పోలి ఉన్నాయి. పిఠాపురంలో బకెట్ గుర్తు అభ్యర్థి కె.పవన్‌కల్యాణ్‌, తెనాలిలో బకెట్ గుర్తు అభ్యర్థి ఎన్‌.మనోహర్‌, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా బాలశౌరి నిలబెట్టాలని అలోచనలో ఉన్నామని నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ చీఫ్‌ జలీల్‌ఖాన్‌ పేర్కొన్నారు. అవి యాధృచ్చికంగా వచ్చాయని,ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed