- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
MLA GV. Anjaneyas : జగన్ పాలనలో 2950 సోషల్ మీడియా కేసులు : వినుకొండ ఎమ్మెల్యే జీ.వి. ఆంజనేయులు
దిశ, వెబ్ డెస్క్ : మాజీ సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి(YS. Jagan Mohan Reddy)పాలనలో మొత్తం 2950 సోషల్ మీడియా కేసు (social media cases)లు పెట్టి వేధించిన సంగతి మరిచిపోతే ఎలా? అని టీడీపీ సీనియర్ నాయకులు, వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు(MLA GV. Anjaneyas) గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంపై జగన్ చేసిన విమర్శలపై ఆయన స్పందించారు. జగన్ వేషం వదిలి క్రిమినల్, ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వాన్ని మరోసారి బయట పెట్టుకుంటున్నారని విమర్శించారు. పోలీసులను భయపెట్టి కేసుల నుంచి తప్పించుకోవాలనే బ్లాక్ మెయిల్ రాజకీయాలకు దిగాడని, పోలీసుల నుంచి కాదు, సప్తసముద్రాల ఆవల ఉన్నా వైసీపీ సైకోలు తప్పించుకోలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీజీపీనే బెదిరించడం ద్వారా కిందిస్థాయి పోలీసు అధికారుల్ని భయపెట్టాలని కుయుక్తికి జగన్ పాల్పడుతున్నాడన్నారు. జగన్, వైసీపీ సైకోలు ఎంత ప్రయత్నించినా వాళ్లందరి తుక్కు రేగడం ఖాయమని హెచ్చరించారు.
జగన్ పాలనలో వైసీపీ సోషల్ మీడియా సాగించిన దుష్పచారాలు, అరాచకాలు ప్రజలు మరిచిపోలేదన్నారు. మూడు డజన్ల కేసులో నిందితుడైన జగన్ 10ఏళ్లు బెయిల్‌పై తిరగడమే అలుసైపోయిందని, రౌడీలను రెచ్చగొట్టి, పోలీసులను భయపెట్టి రాష్ట్రాన్ని రావణకాష్ఠం చేయాలని కుట్రలు చేస్తున్నాడని ఆంజనేయులు ఆరోపించారు. రాష్ట్రంలో నేరాలు తగ్గి శాంతి నెలకొనాలంటే జగన్ రెడ్డినే అరెస్టు చేసి లోపలేయాలని, జగన్ లాంటి విద్రోహశక్తి బయట ఉంటే శాంతిభద్రతలు, సమాజ సామరస్యతకే ముప్పు అని కీలక వ్యాఖ్యలు చేశారు. రౌడీషీటర్లు, హిస్టరీ షీటర్లు, హంతకులందరినీ జైళ్లకు పంపిస్తే వైసీపీ దాదాపు ఖాళీనే అవుతుందని ఎద్దేవా చేశారు.