- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బ్రేకింగ్ న్యూస్.. 2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆర్దిక మంత్రి
దిశ, వెబ్ డెస్క్: 2024 అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి పార్టీ నేడు అసెంబ్లీ సమావేశాల్లో వార్షిక బడ్జెట్(annual budget) ను ప్రవేశ పెట్టింది.సోమవారం(11-11-2024) రోజు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్(Minister Payyavula Keshav) అసెంబ్లీలో బడ్జెట్ ప్రతులను చదివి వినిపించారు. 2024- 2025 ఆర్థిక సంవత్సరానికి గాను ఏపీ ప్రభుత్వం 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ (annual budget)ను ప్రతిపాధించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. శాశ్వత రాజధాని లేకుండా రాష్ట్ర విభజన జరిగిందని రాష్ట్రాన్ని పునర్మిర్మాణ దిశగా నడిపించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుందని, గత ప్రభుత్వం నీటి పారుదల రంగాన్ని పూర్తిగా విస్మరించిందని గత ప్రభుత్వం పోలవరం నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లలేదని.. గత ప్రభుత్వం ఉత్పాదక మూలధనాన్ని నిలిపివేసింది తద్వారా ఉత్పత్తి తగ్గిపోయి అభివృద్ధికి ఆటంకం కలిగిందని ఈ సందర్భంగా మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పుకొచ్చారు. కాగా నీటి పారుదల, సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్‌ను ఆర్థిక శాఖ రూపొందించినట్లు స్పష్టం అవుతుంది.
మొత్తం 2.94 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్..
- రెవెన్యూ వ్యయం(Revenue Expenditure) అంచనా రూ.2.34లక్షల కోట్లు..
- రెవెన్యూ లోటు రూ.34,743 కోట్లు,
- ద్రవ్యలోటు రూ.68,743 కోట్లు,
- ఉన్నత విద్య రూ.2326 కోట్లు,
- పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి రూ. 16.739 కోట్లు,
- పోలీస్ శాఖ రూ. 8495 కోట్లు,
- జలవనరులకు రూ.16,705 కోట్లు
- పట్టణాభివృద్ధి రూ.11490 కోట్లు,
- పరిశ్రమలు, ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు,
- వాణిజ్యం రూ.3,127 కోట్లు..
- ఇంధన రంగం రూ.8,207 కోట్లు..
- బీసీ సంక్షేమం రూ.3,907 కోట్లు..
- మైనార్టీ సంక్షేమం రూ.4,376 కోట్లు...
- అటవీ పర్యావరణ శాఖ రూ.687 కోట్లు..
- గృహ నిర్మాణం రూ. 4,012 కోట్లు..
- నైపుణ్యాభివృద్ధి శాఖ రూ.1,215 కోట్లు..
- వ్యవసాయ రంగానికి రూ. రూ. 43,402 కోట్లు ప్రతిపాదించారు.