- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిక్కెంచని ''యువగళం''.. 21 రోజులైనా క్యాడర్‌లో జోష్ నింపలేకపోతున్న లోకేష్!
దిశ, ఏపీ బ్యూరో: టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి తనయుడు లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర ప్రారంభించి 20 రోజులైంది. ప్రసంగాల్లో ఎక్కడ స్వరం పెంచాలి.. మరెక్కడ తగ్గించాలనే స్పష్టత మొదటినుంచీ కొరవడింది. తొలి రోజు యువతకు ప్రత్యేక మేనిఫెస్టో రూపొందిస్తామనే అంశం కొద్దిమేర యవజనాన్ని తాకింది. తర్వాత వైసీపీ నేతల విమర్శలకు ప్రతి విమర్శలకే ఎక్కువ ప్రాధాన్యమిచ్చినట్లు కనిపిస్తోంది. దీని వల్ల టీడీపీకి ఒరిగేదేమీ లేదు. కాకుంటే క్యాడర్‌లో జోష్నింపడానికి దోహదపడుతోంది. మొత్తంగా లోకేశ్ పాదయాత్ర వల్ల పార్టీకి ప్రయోజనమేంటనేది తమ్ముళ్లలో చర్చనీయాంశమైంది. ఇటు సగటు ప్రజల్లోనూ లోకేశ్కొత్త విషయాలు ఏం చెబుతారా అనే ఆసక్తి నెలకొంది.
రాష్ట్రంలో యువతను పట్టిపీడిస్తున్న నిరుద్యోగ సమస్య అంతాఇంతా కాదు. సుమారు కోటి మంది యువకులుంటే అందులో 20 శాతం మేర శాశ్వత కొలువులు లేదా సుస్థిర ఆదాయం పొందుతున్నారు. మిగిలిన వాళ్లంతా అసంఘటిత రంగంలో ఉట్టికి స్వర్గానికి మధ్య వేలాడుతున్నారు. స్థిరమైన ఉపాధి లేక తగిన ఆదాయం రాక వివాహాలను వాయిదా వేసుకుంటున్న వాళ్లకు కొదవ లేదు.
మరికొందరు అత్తెసరు వేతనాలతో కుటుంబాలకు తోడుగా నిలుస్తున్నారు. ఇలాంటి దుస్థితిలో ప్రతిపక్ష పార్టీ నేతగా నారా లోకేశ్ ఏం చెబుతారా అనే ఆసక్తి ఉండడం సహజం. దీనిపై ఆయన ప్రత్యేక మేనిఫెస్టో తీసుకొస్తామని చూచాయగా ప్రకటించారు. 35 లక్షల మందికి ఉపాధి లేదా ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏ రంగంలో ఎంత మందికి సుస్థిర ఉపాధి కల్పిస్తారు.. సగటున ఎంత ఆదాయం వచ్చేట్లు చేస్తారు! టీడీపీ అధికారానికి వస్తే అందుకోసం ఏం చేస్తారనే స్పష్టత ఇచ్చి ఉంటే బావుండేదని యువత నుంచి వినిపిస్తోంది.
కౌలు రైతులకు మెరుగైన చట్టం తీసుకొస్తామని లోకేశ్హామీనిచ్చారు. దీనిపై కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ లేదు. ఎలా భరోసా కల్పిస్తారనేది వెల్లడించలేదు. టీడీపీ అధికారానికి వస్తే పేద ఎస్సీ ఎస్టీలకు 500 యూనిట్ల దాకా ఉచిత కరెంటు అందిస్తామనే హామీ కొంతవరకు ఆకట్టుకుంది. బీసీలకు చట్టసభల్లో ప్రాధాన్యం ఇస్తామని చెప్పినా వెనుకబడిన వర్గాలను అంతగా తాకలేదు. మొత్తం 139 బీసీ కులాల్లో నాలుగైదు సామాజిక వర్గాలు మినహా మిగతా వాళ్లంతా చట్టసభల్లో పోటీ చేసేంత సంఖ్యాబలం లేని కులాల వాళ్లే. ప్రభుత్వ విధివిధానాలను రూపొందించడంలో వీళ్లకు ఎలా ప్రాతినిధ్యం కల్పిస్తామనే స్పష్టత ఇవ్వలేదు.
లోకేశ్ పాదయాత్రలో అనేక వర్గాలకు చెందిన ప్రజలు కలుస్తున్నారు. వాళ్ల సమస్యలను విన్నవిస్తున్నారు. టీడీపీ అధికారానికి వచ్చాక సమస్యలను పరిష్కరిస్తామని చెబుతున్నారు. ఇది మాత్రమే చాలదు. విద్య, వైద్యం, ఉపాధి, మౌలిక సదుపాయాల రంగాల్లో ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలేమిటి? అధికారానికి వస్తే టీడీపీ ఏం చేస్తుందనేది చెప్పగలిగితే అత్యధిక ప్రజలను ఆకట్టుకోగలుగుతారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ అసమానతలను ఎలా తగ్గిస్తారనేది చెప్పకుండా అణగారిన వర్గాలను సంతృప్తిపరచలేరు. ఈ అంశాలపై మాట్లాడకుండా మరేం చెప్పినా ఆయన పాదయాత్ర చప్పగా సాగుతుంది తప్ప మెజార్టీ ప్రజల్లో చర్చ జరిగేదేమీ ఉండదు.
ఇప్పటిదాకా లోకేశ్ ప్రసంగాల్లో విషయం తక్కువ.. విమర్శలెక్కువన్నట్లు కనిపిస్తోంది. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేల చౌకబారు విమర్శలకు సమాధానాలు ఇవ్వడానికే ప్రాధాన్యం ఇస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీని వల్ల టీడీపీకి ఒరిగేదేమీ లేదు. ప్రతీ నియోజకవర్గానికి వెళ్తున్నప్పుడు కనీసం అక్కి ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను టీడీపీ అధికారానికి వస్తే ఎలా పరిష్కరిస్తుందో చెప్పగలగాలి. అప్పుడే ఆయా ప్రాంత ప్రజలను ఆకట్టుకుంటారు.
ఇక పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకులకు పాదాభివందనాలు చేయడం తమ్ముళ్లలో సంతృప్తినిస్తోంది. జెండా మోసే క్యాడర్ సంక్షేమానికి పార్టీ కట్టుబడి ఉన్నట్లు సంకేతాలిచ్చారు. వైసీపీ, టీడీపీ బలాబలాల మధ్య సుమారు 10 శాతానికి పైగా ఓట్ల తేడా ఉంది. వైసీపీ వెనుక ఉన్న ఓటర్లను ఆకట్టుకునేలా లోకేశ్ ప్రసంగాలు ఉండడం లేదు. ఆయన పదేపదే ముఖ్యమంత్రి వైఎస్జగన్ను దూషించడం వల్ల పార్టీకి ఒరిగేదేమీ లేదు. ఈ లోపాలను సరిచేసుకుంటే మంచిదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి: సీఎం జగన్‌కు భయమేంటో చూపిస్తా: నారా లోకేష్ వార్నింగ్