- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీలో ఐదు రెడ్ జోన్లు ఇవే!
ఆంధ్రప్రదేశ్‌లో ఐదు రెడ్ జోన్లు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. లాక్‌డౌన్ ముగింపు గడువు ముంచుకొస్తున్న నేపథ్యంలో కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రత ఆధారంగా రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దేశంలో రెడ్ జోన్‌లో 130 జిల్లాలు ఉండగా, ఏపీలో ఐదు జిల్లాలు ఈ జోన్‌లో ఉన్నట్టు వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక కేసులు నమోదవుతున్న తొలి ఐదు జిల్లాలను ఈ రెడ్ జోన్‌లో చేర్చింది. కర్నూలు, గుంటూరు, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను ఈ జోన్‌లో చేర్చింది. ఈ ఐదు జిల్లాల్లో గత నెల ఆరంభం నుంచి కరోనా వైరస్ విజృంభించింది. దీంతో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతూ ప్రభుత్వ, అధికార వర్గాలను ఆందోళనకు గురి చేసింది. కేంద్రం ప్రకటన నేపథ్యంలో రెడ్ జోన్‌లో కఠిన ఆంక్షలు అమలు చేసి, ఇతర చోట్ల పాక్షిక లాక్‌డౌన్ అమలు చేస్తే సరిపోతుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నారు. రెడ్ జోన్ విధించిన ఐదు జిల్లాల్లో కేసుల వివరాల్లోకి వెళ్తే…
కర్నూలు జిల్లాలో 386 మందికి కరోనా సోకగా, 334 మంది ప్రస్తుతం ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 43 మంది డిశ్చార్జ్ అయ్యారు. 9 మంది మృత్యువాత పడ్డారు. గుంటూరు జిల్లాలో 287 మందికి కరోనా సోకితే, 192 మంది చికిత్స పొందుతున్నారు, 87 మంది వ్యాధి నుంచి ఉపశమనం పొంది డిశ్చార్జ్ అయ్యారు. 8 మంది మరణించారు. కృష్ణా జిల్లాలో 246 మందికి కరోనా సోకితే…206 మంది చికిత్స పొందుతున్నారు. 32 మంది డిశ్చార్జ్ అయ్యారు. 8 మంది చనిపోయారు. నెల్లూరు జిల్లాలో 84 మందికి కరోనా సోకగా, ఇద్దరు చనిపోతే, 27 మంది కోలుకున్నారు. 55 మంది చికిత్స పొందుతున్నారు. ఇక చిత్తూరు జిల్లాలో 80 మందికి కరోనా సోకితే, 64 మంది ఇంకా ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 16 మంది కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
tags: andhra pradesh, red zone, 5 districts, kurnool, guntur, krishna, nellore, chittore