తారలు మెచ్చే ‘సోజత్ మెహందీ’.. జీఐ ట్యాగ్‌తో కల్తీకి చెక్!

by Shyam |
తారలు మెచ్చే ‘సోజత్ మెహందీ’.. జీఐ ట్యాగ్‌తో కల్తీకి చెక్!
X

దిశ, ఫీచర్స్: మహిళలకు, మెహందీకి విడదీయరాని అనుబంధముంటుంది. పండుగైనా, పేరంటమైనా, కాలేజీ ఫెస్ట్ వచ్చినా, ఆషాఢమాసమొచ్చినా అమ్మాయిల చేతులు మెహందీ వనమైపోతాయి. గోరింటాకును రిప్లేస్ చేసే బ్రాండ్స్ ఏవీ మార్కె్ట్లోకి రాకున్నా.. దాని ఔషధ గుణాలతో రాజస్థాన్‌కు చెందిన ‘సోజత్ మెహందీ’ మాత్రం ప్రపంచ ప్రఖ్యాతగాంచింది. 1969లో ప్రారంభమైన నాటి నుంచి ప్రజల ఆదరణ అందుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటీవలే ప్రభుత్వం నుంచి జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్‌ పొందింది.

And now, a GI tag adds more vibrancy to Rajasthan's Sojat Mehndi - The Hindu

జీఐ(Geographical indication)ట్యాగ్ అనేది ఒక నిర్దిష్ట భౌగోళిక భూభాగం నుంచి ఉద్భవించే వ్యవసాయ, సహజ లేదా మాన్యుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ (హస్తకళ, ఇండస్ట్రియల్ గూడ్స్)కు అందిస్తారు. ఈ ట్యాగ్ ఆ ప్రొడక్ట్ నాణ్యత, విలక్షణత హామీని తెలియజేస్తుంది. అంతేకాకుండా ఆ భౌగోళిక ప్రాంతానికి కూడా గుర్తింపు తీసుకొస్తుంది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రీమియం ధరలను నిర్దేశించే జెన్యూన్ ఉత్పత్తుల ఉత్పత్తిదారులకు ట్యాగ్ రక్షణను అందిస్తుంది. ఉదాహరణకు డార్జిలింగ్ టీ, తిరుపతి లడ్డూ, కాంగ్రా పెయింటింగ్స్, నాగ్‌పూర్ ఆరెంజ్, కశ్మీర్ పష్మీనా భారతదేశంలో జీఐ(Geographical indication) సాధించిన జాబితాలో కొన్ని ప్రొడక్ట్స్. ఒక ఉత్పత్తికి ఈ ట్యాగ్ వచ్చిన తర్వాత ఆ పేరుతో ఏ వ్యక్తి లేదా కంపెనీ ఇలాంటి వస్తువును విక్రయించలేరు. ఈ ట్యాగ్ 10 సంవత్సరాల పాటు చెల్లుబాటులో ఉంటుంది. ఆ తర్వాత దానిని పునరుద్ధరించవచ్చు. ఐశ్వర్యరాయ్, ప్రియాంక చోప్రా వంటి బాలీవుడ్ తారలు వేడుకల సమయంలో ‘సోజత్ మెహందీ’ఉపయోగించారు. సోజత్‌లోని రైతులు, వ్యాపారులు, తయారీదారులు, కార్మికులు మొత్తంగా రూ.1000 కోట్ల విలువైన మెహందీ వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు.

Priyanka Chopra Mehendi Ceremony | Camilla Henna Cones

రాజస్థాన్‌లోని సుక్రీ నది ఒడ్డున ఉన్న సోజత్ పట్టణంలో పెరిగిన మెహందీ ఆకుల నుంచి ‘సోజత్ మెహందీ’ ఉద్భవించింది. మెహందీ ఆకుల్లో అధిక లాసోన్ కంటెంట్ పొందడానికి పూర్తిగా వర్షపు నీటి ద్వారా సహజంగా సాగు చేస్తారు. మెహందీ ఆకులను ఎండబెట్టడం ద్వారా సువాసనగల నూనె కూడా తీయడమే కాదు.. మెహందీ మొక్క ఆకులు, బెరడు, గింజలు, వేర్లను ఔషధ వినియోగంలో ఉపయోగిస్తారు.

మార్కెట్‌లో చాలామంది ‘సోజత్ మెహందీ’ పేరుతో నకిలీ ప్యాకెట్స్ అమ్ముతున్నారు. డార్క్ టింట్ ఇవ్వడానికి PPD (paraphenylenediamine), బెంజైల్ ఆల్కహాల్ వంటి రసాయనాలు ఆ మెహందీకి జోడిస్తారు. ఇవి హానికరం కాగా ఈ కల్తీ ముప్పును అంతం చేయడంలో జీఐ(Geographical indication) ట్యాగ్ సాయపడుతుంది. ఈ ప్రాంతం యొక్క నేల, వర్షపాతం కారణంగా ఇది దాని ప్రత్యేక రంగును పొందుతుండగా.. మెహందీ ఆకులలో ఇతర చోట్ల పెరిగే ఆకుల కంటే 2% ఎక్కువ పిగ్మెంట్ లాసోన్ ఉంటుంది. ఈ మెహందీని పాకిస్థాన్, పశ్చిమాసియా దేశాల్లోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ పండిస్తారు కానీ ఈ ప్రత్యేక రంగు ఆ మెహందీలో ఉండదు.
– సోజత్ మెహందీ వ్యాపార్ సంఘ్‌.

Advertisement

Next Story

Most Viewed