పోలిస్ కేసుపై యాంకర్ శ్యామల భర్త రియాక్షన్ ఇదే…

by Shyam |   ( Updated:2021-04-30 01:56:30.0  )
Anchor Shyamala, Narsimha reddy
X

దిశ, సినిమా: యాంకర్ శ్యామల భర్త నర్సింహా రెడ్డి బెయిల్‌పై బయటకు వచ్చాడు. 2017లో తన దగ్గర రూ. 85 లక్షలు తీసుకున్నాడని, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నాడని సింధూర రెడ్డి అనే మహిళ రెండు రోజుల క్రితం రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, ఆయనపై చీటింగ్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నర్సింహారెడ్డిని అరెస్ట్ చేయగా, ప్రస్తుతం బెయిల్‌పై వచ్చిన ఆయన ఈ విషయంపై స్పందించాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, కావాలనే తప్పుడు ఆరోపణలు చేశారని వివరించాడు. రెండు రోజుల్లో బయటకు వచ్చానంటే తన నిజాయితీని అర్థం చేసుకోవచ్చన్న నర్సింహ.. త్వరలోనే అన్ని ఆధారాలను బయటపెడతానని తెలిపాడు. ఎంత నిజాయితీగా ఉన్నా కొన్నిసార్లు నిందలు పడాల్సి వస్తుందని, ఇలాంటి పుకార్లపై తప్పక స్పందించాల్సిన అవసరం ఉందని వెల్లడించాడు.

Advertisement

Next Story

Most Viewed