- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మరో వివాదంలో యాంకర్ ప్రదీప్.. ప్రముఖ ఛానల్‌కి వార్నింగ్
దిశ, వెబ్‌డెస్క్: యాంకర్ ప్రదీప్ మాచిరాజు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఓ టీవీ షో జరుగుతున్న సమయంలో అమరావతి రాజధాని ఏంటని ప్రదీప్ ప్రశ్నించగా.. అందుకు సీరియల్ నటి వైజాగ్ అంటూ జవాబు ఇచ్చింది. ఈ వ్యవహారంపై ఏపీ పరిరక్షణ సమితి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రదీప్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేనిపక్షంలో హైదరాబాద్‌లోని ప్రదీప్ ఇంటిని ముట్టడి చేస్తామని ఏపీ పరిరక్షణ సమితి కన్వీనర్ కొలికలపూడి శ్రీనివాస రావు హెచ్చరించారు.
అజ్ఞానంతో అమరావతి రాజధాని ఏంటన్న ప్రశ్న.. అతడి సామాజిక బాధ్యతారాహిత్యాన్ని బయటపెట్టిందని విమర్శించారు. 551 రోజులుగా ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని ప్రజలు చేస్తున్న పోరాటం తెలుసుకోలేని ప్రదీప్ అజ్ఞాని అంటూ మండిపడ్డారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల లోపు తన మాటలను వెనక్కి తీసుకోకపోతే.. అతడి ఇంటిని, కార్యక్రమం నిర్వహించిన ఛానల్‌ను మట్టడిస్తామని వార్నింగ్ ఇచ్చారు ఏపీ పరిరక్షణ సమితి సభ్యులు.