ఏపీ రాజధానిపై సంచలన వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పిన యాంకర్ ప్రదీప్ (వీడియో)

by Anukaran |   ( Updated:2021-06-21 06:36:34.0  )
anchor pradeep controversy
X

దిశ, వెబ్‌డెస్క్: బుల్లితెర యాంకర్ ప్రదీప్ మరో వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఒక ప్రముఖ ఛానెల్ లో ప్రసారమవుతున్న షో లో అమరావతి రాజధానిపై సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రదీప్ తన మాటలు వెనక్కి తీసుకోవాలని ఏపీ అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం విదితమే. ఈరోజు మధ్యాహ్నం లోపు ప్రదీప్ క్షమాపణలు చెప్పకపోతే అతని ఇంటికి వచ్చి నిరసన తెలియజేశామని హెచ్చరించించారు. ఇక ఈ విషయమై యాంకర్ ప్రదీప్ స్పందించారు. ఒక వీడియో ద్వారా ప్రదీప్ మాట్లాడుతూ తన వలన ఎవరి మనోభావాలైన దెబ్బతిని ఉంటే వారు తనని క్షమించాలని కోరాడు.

” ఒక టీవీ షో లో రాష్ట్రం, రాజధాని అనే అంశంపై కొన్ని ప్రశ్నలు అడుగుతుండగా.. అవతలి వ్యక్తి తప్పు సమాధానం చెప్పింది. దీంతో ఈ పూర్తి సంభాషణ తప్పుదోవ పట్టింది. బయటికి కూడా వేరే విధంగా వెళ్లడంతో చాలా బాధ అనిపించింది. దీని ద్వారా ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా, ఎవరినైనా ఇబ్బంది పెట్టినా, కించపరిచినా దయచేసి నన్ను మనస్ఫూర్తిగా క్షమించవల్సిందిగా కోరుతున్నాను. ఇది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. కేవలం ప్రేక్షకులను నవ్వించడం కోసం మాత్రమే చేశాను. తెలుగు ప్రేక్షకులందరి బ్లెస్సింగ్స్ ఎప్పుడు నా మీద ఉండాలని కోరుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ప్రదీప్ క్షమాపణలతోనైనా ఏపీ అమరావతి పరిరక్షణ సమితి సభ్యులు శాంతిస్తారేమో చూడాలి.

మరో వివాదంలో యాంకర్ ప్రదీప్.. ప్రముఖ ఛానల్‌కి వార్నింగ్

Advertisement

Next Story