తనకు ఫోన్ చేయొద్దని ఝాన్సీ వార్నింగ్

by Anukaran |   ( Updated:2020-07-04 11:56:20.0  )
తనకు ఫోన్ చేయొద్దని ఝాన్సీ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సినీ రంగాన్ని కుదిపేస్తోంది. లాక్‌డౌన్ కాలంలో షూటింగ్స్‌కు ప్యాకప్ చెప్పారు. ఇటీవల తిరిగి ప్రారంభమయ్యాయి. అయితే నటీనటులకు కరోనా సోకడంతో కలవరం మొదలైంది. తాజాగా నిర్మాత పోకూరి రామారావు వైరస్ బారిన పడి చనిపోయాడు. ప్రముఖ సీనియర్ యాంకర్ ఝాన్సీకి కూడా కరోనా పాజిటివ్ వచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

ఇప్పటికే షూటింగ్స్ మొదలు కావడంతో ఇది నిజమేనని అంతా అనుకున్నారు కూడా. అయితే వెంటనే ఝాన్సీ కూడా ఈ విషయంపై స్పందించింది. ఇప్పటికే బుల్లితెర నటులు ప్రభాకర్, హరికృష్ణ, నవ్యస్వామితో పాటు బిగ్ బాస్ ఫేమ్ రవికృష్ణకు కూడా తాజాగా కరోనా సోకింది. ఈ క్రమంలోనే యాంకర్ ఝాన్సీకి కూడా కరోనా సోకిందంటూ వార్తలు వచ్చాయి.

ఇటీవల ఈమె నిర్వహించిన ఓ కార్యక్రమంలో కొందరికి కరోనా రావడంతో ఝాన్సీకి కూడా వైరస్ సోకిందన్న వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై ఆమె స్పందించింది. తన ఆరోగ్యం గురించి ఆరా తీసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్తూనే తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని.. దయచేసి లేనిపోని సృష్టించొద్దని కోరింది. అంతేకాదు.. గాసిప్స్ గురించి మాట్లాడేందుకు మాత్రం తనకు ఎవరూ ఫోన్ చేయొద్దని వార్నింగ్ కూడా ఇచ్చింది ఝాన్సీ.

Advertisement

Next Story