అనసూయకు బిగ్ షాక్.. ఆ పని చేసి తప్పు చేసిందా.. రాత్రికి రాత్రి ఏం జరిగింది..?

by Anukaran |   ( Updated:2021-10-11 23:42:24.0  )
అనసూయకు బిగ్ షాక్.. ఆ పని చేసి తప్పు చేసిందా.. రాత్రికి రాత్రి ఏం జరిగింది..?
X

దిశ, వెబ్‌డెస్క్: ఎట్టకేలకు మా ఎలక్షన్స్ ముగిశాయి. రసవత్తరంగా సాగిన ఈ పోటీలో ప్రకాష్ రాజ్ ప్యానెల్ మీద మంచు విష్ణు ప్యానెల్ ఘన విజయం సాధించింది. మా ప్రెసిడెంట్ గా విష్ణు గెలిచినా.. వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్, ఈసీ మెంబర్ గా ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి సుధీర్ విన్ అయ్యారు. అయితే దీనిపై హాట్ యాంకర్ అనసూయ ఫైర్ అయ్యింది. మొదట ఈసీ మెంబర్ గా సుధీర్ పై అనసూయ గెల్చినట్లు చెప్పినా రాత్రికి రాత్రి రిజల్ట్ తారుమారు అయ్యి చివరికి సుధీర్ యే ఈసీ మెంబర్ గా గెలిచినట్లు ప్రకటించారు. ఇక ఈ విషయంపై అనసూయ ట్విట్టర్ ద్వారా సెటైర్ వేసింది. “క్షమించండి.. ఒక విషయం గుర్తొచ్చి నాకు నవ్వొచ్చేస్తుంది.. మీతో పంచుకుంటున్నా..ఏమోనుకోవొద్దోయ్.. నిన్న అత్యధిక మెజారిటీ, భారీ మెజారిటీతో గెలుపు అని.. ఈరోజు ఓటమి, లాస్ట్ అంటున్నారు.. రాత్రికి రాత్రి ఏం జరిగి ఉంటుందబ్బా ” అంటూ కౌంటర్ వేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

ఇక ఈ ట్వీట్ తో అనసూయ గట్టిగా హర్ట్ అయినట్లు తెలుస్తోంది. తాను ఎన్నికల్లో పోటీ చేసి తప్పు చేసినట్లు అమ్మడు ఒప్పుకోంది. నిజమైన గుణపాఠాన్ని నేర్చుకున్నాని, తనకు ఈ ఎన్నికలు, రాజకీయాలు వద్దని, తన పని, పిల్లలను చూసుకొంటానని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఎక్కడైనా గెలుపు ఓటములు సహజమని, ఇంత చిన్న ఓటమికి అంత పెద్ద నిర్ణయం తీసుకోవడం మంచిదికాదని నెటిజన్లు అనసూయకు హితవు పలుకుతున్నారు. మరి అనసూయ ఆగ్రహాన్ని మా సభ్యులు గుర్తిస్తారా..? రాత్రికి రాత్రి ఏం జరిగిందో తెలుపుతారా..? అనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed