- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అలియా పాటకు అనన్య డాన్స్
అనన్య పాండే.. బాలీవుడ్ సూపర్ ప్రెట్టీ హీరోయిన్. ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’ సినిమాతో యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ క్వీన్.. ‘బాలీవుడ్‌లో నంబర్ వన్ స్థానానికి పోటీ పడుతున్న అలియా భట్ తనకు స్పూర్తి’ అని చెబుతోంది. అలియా యాక్టింగ్, డ్యాన్స్, గ్రేస్ అన్నీ తనకు ఇష్టమని చాలాసార్లు చెప్పింది కూడా. కానీ, తన పాటలకు డ్యాన్స్ చేస్తూ.. తనలాగే స్టెప్పులు వేస్తూ ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడు అలియా పాటకు స్టెప్పులు వేస్తున్న అనన్య వీడియో ఒకటి ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్మెంట్ ఇస్తోంది. ‘కలంక్’ సినిమాలో ‘ఘర్ మోరే పర్ దేశియా’ పాటకు అలియా ఏ రేంజ్‌లో స్టెప్పులు వేసిందో తెలిసిందే. ఇప్పుడు ఇదే పాటకు స్టెప్పులు వేస్తున్న అనన్య వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తుండగా.. నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
అనన్య తనకు క్లాసికల్ డ్యాన్స్ నేర్పిస్తున్న టీచర్‌తో రిహార్సల్ చేస్తుండగా తీసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. పింక్ కుర్తాలో ఉన్న అనన్య స్టెప్స్ వేస్తుండగా.. తన టీచర్‌కు చేయి తాకింది. దీంతో వెంటనే నవ్వడం స్టార్ట్ చేసిన అనన్య.. కలంక్ సాంగ్‌పై పూర్తిగా స్టెప్స్ వేయనే లేదు. కానీ ఈ వీడియోలో తన నవ్వుకు పడిపోక తప్పదంతే అంటున్నారు ఫ్యాన్స్.
ప్రస్తుతం పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్‌లో వస్తున్న ఫైటర్ సినిమాతో పాన్ ఇండియా మూవీ చేస్తున్న అనన్య.. ఈ చిత్రం ద్వారా సౌత్ ఇండస్ట్రీలో అడుగుపెట్టనుంది. వీలైనంత వరకు తన పాత్రకు తానే డబ్బింగ్ కూడా చెప్పుకుంటాను అంటోంది. ఇంత కాన్ఫిడెన్స్‌తో ఉన్న అనన్య ప్రతిభపై ఈ మధ్య చార్మి కూడా బెట్ కాసిన విషయం తెలిసిందే. ఫైటర్ సినిమా రిలీజ్ అయితే అనన్య ఇండియాలోని మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్ట్‌లో టాప్ 3లో ఉంటుందని చెప్పింది. చూడాలి మరి ఏం జరుగుతుందో.