భవన నిర్మాణ పనులు తనిఖీచేసిన ఎమ్మెల్యే

by  |
భవన నిర్మాణ పనులు తనిఖీచేసిన ఎమ్మెల్యే
X

దిశ, చెన్నూర్: పట్టణం లోని గాంధీ చౌక్ ప్రాంతంలో గల ప్రభుత్వ ఆసుపత్రి నూతన భవన నిర్మాణ పనులను ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ సోమవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు. నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనుల ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. పేదప్రజల కోసం అన్ని వసతులతో కూడిన వైద్యం ప్రతి నిరుపేదకు అందాలనే ఉద్దేశంతో భవన నిర్మాణం కోసం ఏడు కోట్ల రూపాయలను మంజూరు చేయించారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పట్టణంలోనే నాణ్యమైన వైద్యం ప్రతి ఒక్కరికి అందాలనే ఉద్దేశ్యంతో నిర్ణీత గడువు కంటే ముందే అన్ని వసతులతో కూడిన ఆసుపత్రిని నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే కంకణం కట్టుకున్నట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story