- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాపం అవ్వ.. పదిహేను రోజులుగా రోడ్డుపైనే
దిశ ప్రతినిధి, మేడ్చల్:
రాజధాని మహానగరంలో.. ఓ అవ్వ నరకయాతన అనుభవిస్తోంది. ఇటీవల జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆమె కాలు విరిగిపోయింది. దీంతో అప్పటి నుంచి ఆమె రోడ్డుపైనే ఉంటూ, భరించలేని నొప్పితో.. మరోవైపు ఆకలితో అలమటిస్తోంది. నోటీ మాట రావడం లేదు. కేవలం కళ్లతోనే చూస్తోంది. ఇలా పదిహేను రోజులుగా రోడ్డుపైనే ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ విగత జీవిగా పడి ఉంది.
వివరాళ్లోకి వెళితే.. కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాయల సమీపంలో ఓ గుర్తు తెలియని వృద్ధురాలు(80) విగత జీవిలా కొట్టు మిట్టాడుతోంది. నోటి నుంచి మాట రావడంలేదు. ఎవరు పలకరించిన కళ్లతో చూడడం తప్ప, తన వివరాలను చెప్పలేక విలవిలలాడుతోంది. అందరూ ఆ అవ్వను చూస్తూ వెళ్తున్నారనే.. తప్ప వైద్యం, వసతులు కల్పించడం లేదు. కరోనా ఉందేమో అన్న అనుమానంతో ఆమె దగ్గరికి కూడా ఎవరూ పోవడం లేదు.
పోలీసులకు, జీహెచ్‌ఎంసీ అధికారులకు సమాచారం ఇచ్చినా వారు కన్నెత్తి కూడా చూడడం లేదు. స్థానికంగా పూల మొక్కలు, కొబ్బరి బొండాలు విక్రయించే సూరిబాబు, ఫణికుమార్‌లు ఇద్దరు చిరు వ్యాపారులు కనకరించి ఓ గొడుగును ఇచ్చారు. అదేవిధంగా పది హేను రోజులుగా ప్రతి రోజు బిస్కెట్లు, చాయ్ అందిస్తున్నారు. అన్నం , ఇతర పదార్థాలు తినడం లేదంటున్నారు. ఆమె ఆచూకీ కోసం పలు మార్లు అడిగిన నోటీ మాట రావడం లేదని చెబుతున్నారు. అధికార యంత్రాంగం తక్షణమే ఆమెకు వైద్యం అందించాలని కోరుతున్నారు.