అమితాబ్‌ను సోనుసూద్‌తో పోల్చుతున్న ఫ్యాన్స్..?

by Shyam |
Amitabh-Bachchan
X

దిశ, సినిమా : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఇన్‌స్టాగ్రామ్‌లో తన త్రో బ్యాక్ పిక్చర్ ఒకటి షేర్ చేశారు. అది 1971లో రిలీజైన తన సినిమాకు సంబంధించిన లుక్ టెస్ట్ ఫొటో కాగా.. ఫ్యాన్స్ మాత్రం ‘బిగ్ బీ’ని మరొక బాలీవుడ్ నటుడితో పోల్చడం విశేషం. ఈ పిక్చర్‌లో తలకు పొడవాటి రుమాలు, రెండు నెక్లెస్‌లతో పాటు చెవిపోగులు ధరించిన అమితాబ్.. రాజస్థానీ వేషధారణలో కనిపించాడు. కాగా ఈ పిక్ షేర్ చేసిన బచ్చన్ జీ.. 1969 లో ‘రేష్మా ఔర్ షేరా’ మూవీ నుంచి నా లుక్ టెస్ట్’ అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ మేరకు బచ్చన్ మనువరాలు నవ్య నవేలి నంద హార్ట్ ఎమోజీ పోస్ట్ చేయగా, రణ్‌వీర్ సింగ్ స్టార్ ఎమోజీ షేర్ చేశాడు. కానీ చాలా మంది ఫ్యాన్స్ మాత్రం అచ్చం ‘సోనుసూద్’ మాదిరి కనిపిస్తున్నారంటూ కామెంట్ చేస్తున్నారు.

అయితే సోనుసూద్ కూడా అమితాబ్‌కు హార్డ్ కోర్ ఫ్యాన్ అని తెలిసిందే. గతంలో తన బుక్ ‘ఐయామ్ నాట్ ఏ మెస్సాయ’ ప్రమోషన్ నిమిత్తం కౌన్ బనేగా కరోడ్‌పతి షోకు వచ్చిన సోను.. ఫ్యాన్స్ తనను అమితాబ్‌తో పోలిస్తే వినయపూర్వకంగా సమాధానమిచ్చారు.

Advertisement

Next Story